'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'తో అనిల్ రావిపూడి!

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటించారు. కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఏప్రిల్ 18న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రచారంలో దూకుడు పెంచారు మేకర్స్.
లేటెస్ట్‌గా కళ్యాణ్‌రామ్, విజయశాంతి లతో పాటుగా అనిల్ రావిపూడితో సుమ ఓ ఇంటర్యూ చేసింది. ఈరోజు శ్రీరామనవమి కానుకగా ఈ ఇంటర్యూని విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే రిలీజైంది. అనిల్ రావిపూడిని డైరెక్టర్ గా పరిచయం చేసింది కళ్యాణ్ రామ్. ఇక విజయశాంతి రీఎంట్రీ మూవీ 'సరిలేరు నీకెవ్వరు'ని డైరెక్ట్ చేసింది కూడా అనిల్ రావిపూడి. అందుకే.. తాను ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నానని క్లారిటీ ఇచ్చాడు అనిల్ రావిపూడి.
ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తుండడం విశేషం. ఈ సినిమాలో సయీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా, సోహైల్ ఖాన్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
-
Home
-
Menu