‘అనగనగా ఒకరాజు‘ సంక్రాంతి ప్రోమో

‘అనగనగా ఒకరాజు‘ సంక్రాంతి ప్రోమో
X
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి అంటేనే నవ్వులే నవ్వులు. ‘జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ తర్వాత నవీన్ నుంచి రాబోతున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు‘.

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి అంటేనే నవ్వులే నవ్వులు. ‘జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ తర్వాత నవీన్ నుంచి రాబోతున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు‘. ఈ సినిమాలో నవీన్ కి జోడీగ మీనాక్షి చౌదరి నటిస్తుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘అనగనగా ఒక రాజు‘ సంక్రాంతి బరిలో రాబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు.

లేటెస్ట్ గా ‘అనగనగా ఒక రాజు‘ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న రాబోతున్నట్టు స్పెషల్ అనౌన్స్ మెంట్ ప్రోమో రిలీజ్ చేసింది టీమ్. పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘తో పాటు థియేటర్లలో ఈ ప్రోమోని ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రోమోలో హీరోహీరోయిన్లు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి ‘అనగనగా ఒక రాజు‘ సంక్రాంతి బరిలో వస్తున్నట్టు వైవిధ్యంగా తెలిపారు. మొత్తంగా.. ‘ఈ సంక్రాంతికి దద్దరిల్లే నవ్వులని ఆనందాన్ని తీసుకొస్తున్నాము..‘ అంటూ సితార టీమ్ కాన్ఫిడెంట్ గా చెబుతుంది.

మరోవైపు ఇప్పటికే సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు‘, ప్రభాస్ ‘ది రాజా సాబ్‘, రవితేజ 76 వంటి సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. తమిళం నుంచి కూడా విజయ్ ‘జన నాయకుడు‘, శివ కార్తికేయన్ ‘పరాశక్తి‘ సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి.



Tags

Next Story