డిసెంబర్ లోనే 'అఖండ 2: తాండవం'!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ– మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే టాలీవుడ్‌లో బాక్సాఫీస్ హిట్‌కి హామీ అన్నట్టే. 'సింహా, లెజెండ్, అఖండ' వంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత ఇప్పుడు వీరిద్దరి నాలుగో సినిమా 'అఖండ 2: తాండవం' సిద్ధమవుతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తుండగా, బాలయ్య చిన్న కుమార్తె ఎం.తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌పై 600 మంది డ్యాన్సర్లతో మాస్ సాంగ్‌ని చిత్రీకరించారు. భాను కొరియోగ్రఫీలో, తమన్ సంగీతంలో రూపొందిన ఈ పాట బాలయ్య ఎనర్జీతో థియేటర్లలో దుమ్మురేపనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
మొదట దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం, రీ-రికార్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా వాయిదా పడింది. లేటెస్ట్ గా అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యేలతో మాట్లాడిన బాలయ్య, 'అఖండ 2' డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. హిందీ డబ్బింగ్ అద్భుతంగా వచ్చిందని, అన్ని భాషల్లోనూ గ్రాండ్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిపాడు.
ఈ సినిమాలో సంజుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మొత్తంగా.. నందమూరి అభిమానులు డిసెంబర్ 5న 'అఖండ 2 తాండవం' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
-
Home
-
Menu