'అఖండ 2' ఇంటర్వెల్ తాండవమే!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అఖండ 2'. సూపర్ హిట్ మూవీ 'అఖండ'కి సీక్వెల్ గా వస్తోన్న ఈ చిత్రానికి 'తాండవం' అనేది ట్యాగ్ లైన్. ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలో బాలయ్య పాత్రకు విపరీతమైన ఎమోషనల్ డెప్త్ ఉంటుందట. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ పార్ట్‌లోని ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని టాక్.
ఈ ఎమోషనల్ టచ్‌తో పాటు మాస్ ఎలిమెంట్స్‌ని సమపాళ్లలో మేళవిస్తున్న బోయపాటి, ఈసారి కూడా తన మార్క్ ఇంటర్వెల్ బ్లాస్ట్‌ను అందించబోతున్నాడట. 'అఖండ 2'లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఫస్ట్ పార్ట్ కంటే చాలా పవర్ఫుల్‌గా ఉంటుందని సమాచారం.
శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న 'అఖండ 2' చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కి పవర్‌ఫుల్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన తమన్ ఇప్పుడు సీక్వెల్ కి అంతకు మించిన రీతిలో సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. దసరా కానుకగా ఈ ఏడాది సెప్టెంబర్ లో 'అఖండ 2' ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
-
Home
-
Menu