‘మండాడి’ షూటింగ్‌లో ప్రమాదం

‘మండాడి’ షూటింగ్‌లో ప్రమాదం
X
తమిళ నటుడు సూరి, తెలుగు నటుడు సుహాస్ కలిసి నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘మండాడి’. ఆద్యంతం సముద్ర నేపథ్యంలో సాగే ఈ సినిమాకోసం తమిళనాడు రామనాథపురం జిల్లా తొండి సముద్రతీరంలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

తమిళ నటుడు సూరి, తెలుగు నటుడు సుహాస్ కలిసి నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘మండాడి’. ఆద్యంతం సముద్ర నేపథ్యంలో సాగే ఈ సినిమాకోసం తమిళనాడు రామనాథపురం జిల్లా తొండి సముద్రతీరంలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా సాంకేతిక నిపుణులు ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది.

ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు నీటిలో మునిగిపోయారు, వెంటనే యూనిట్ సభ్యుల తక్షణ చర్యతో ప్రాణనష్టం తప్పింది. అయితే, కోటి రూపాయల విలువ చేసే కెమెరాలు మరియు పరికరాలు నీట మునిగిపోవడంతో భారీ ఆర్థిక నష్టం సంభవించింది. ఈ సినిమాను జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్ నిర్మిస్తుండగా, మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Tags

Next Story