లండన్ లో మెగాస్టార్ కి ఘన స్వాగతం!

లండన్ లో మెగాస్టార్ కి ఘన స్వాగతం!
X
మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు నాలుగున్నర దశాబ్దాలుగా చేస్తున్న సేవలు, వ్యక్తిగతంగా చేపట్టిన సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వం ఆయనను ‘జీవిత సాఫల్య పురస్కారం’తో సత్కరించనుంది.

మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు నాలుగున్నర దశాబ్దాలుగా చేస్తున్న సేవలు, వ్యక్తిగతంగా చేపట్టిన సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వం ఆయనను ‘జీవిత సాఫల్య పురస్కారం’తో సత్కరించనుంది. ఈ పురస్కారాన్ని మార్చి 19న లండన్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో అందించనున్నారు.

ఈ మేరకు చిరంజీవి లండన్ చేరుకోగా, విమానాశ్రయంలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ‘వెల్‌కమ్ అన్నయ్యా’ అంటూ ఫ్లెక్సీలతో సందడి చేస్తూ ఆయనతో ఫోటోలు దిగారు. ఈ వేడుకకు యూకే లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా నేతృత్వం వహించనున్నారు.

సినిమాల విషయానికొస్తే, చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’లో నటిస్తుండగా, శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రెండు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఏడాదిలో ‘విశ్వంభర‘, వచ్చే సంక్రాంతి బరిలో అనిల్ రావిపూడి సినిమాలు రావడం పక్కా అనేది మెగా న్యూస్.

Tags

Next Story