‘8 వసంతాలు‘ కోసం చిత్ర పాడిన పాట!

‘8 వసంతాలు‘ కోసం చిత్ర పాడిన పాట!
X
పేరుకు చిన్న సినిమా అయినా సినీ ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తున్న చిత్రం ‘8 వసంతాలు‘. ‘మ్యాడ్‘ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ ప్రధాన పాత్రలో ఫీమేల్ సెంట్రిక్ పాయింట్ తో రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపొందింది.

పేరుకు చిన్న సినిమా అయినా సినీ ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తున్న చిత్రం ‘8 వసంతాలు‘. ‘మ్యాడ్‘ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ ప్రధాన పాత్రలో ఫీమేల్ సెంట్రిక్ పాయింట్ తో రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపొందింది. ఫణీంద్ర నార్సెట్టి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించడం విశేషం. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలతో ‘8 వసంతాలు‘పై బజ్ భారీగా పెరిగింది.

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘పరిచయమిలా‘ అంటూ సాగే మెలోడియస్ సాంగ్ రిలీజయ్యింది. ఈ పాటను హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతంలో లెజెండరీ సింగర్ చిత్ర ఆలపించారు. వనమాలి లిరిక్స్ తో అందంగా కుదిరిన ఈ మెలోడీని అంతే అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించినట్టు ఈ లిరికల్ సాంగ్ చూస్తే అర్థమవుతుంది. జూన్ 20న ‘8 వసంతాలు‘ విడుదలకు ముస్తాబవుతుంది.



Tags

Next Story