అల్లు అర్జున్ కోసం కొత్త ప్రపంచం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘AA 22xA6’. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె ఒక కథానాయికగా నటిస్తుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై యావత్ సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
లేటెస్ట్ గా బెంగళూరులో జరిగిన పికిల్‌బాల్ టోర్నమెంట్‌లో డైరెక్టర్ అట్లీ మాట్లాడుతూ, ‘ఈ సినిమా సాధారణ చిత్రంలా కాదు. కొత్త ఆలోచనలతో ఒక ప్రత్యేక ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించనున్నాం. మునుపెన్నడూ చూడని అనుభూతిని ఇవ్వడం మా లక్ష్యం. ఈ భారీ ప్రాజెక్ట్‌ను రూపొందించడం రిస్క్ అనిపించడం లేదు, ఈ ప్రాజెక్ట్ ను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను‘ అని తెలిపాడు.
ఇంటర్నేషనల్ లెవెల్ టెక్నీషియన్స్ పనిచేస్తున్న ఈ మూవీ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నట్లు అట్లీ వెల్లడించాడు. ఈ సినిమా ఇటీవలే ముంబయ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అండ్ టీమ్ రెస్ట్ మోడ్ లో ఉన్నారు. త్వరలో ఈ మూవీ కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. 2027లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
-
Home
-
Menu