హృదయాన్ని తాకే మెలోడి

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కింగ్డమ్'. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కింగ్డమ్'. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే విడుదలైన 'కింగ్డమ్' టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది. లేటెస్ట్‌గా ఈ మూవీ నుంచి 'హృదయం లోపల' అంటూ సాగే రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజయ్యింది. రెగ్యులర్ రొమాంటిక్ మెలోడీలా కాకుండా.. కథలో అంతర్భాగంగా ఈ పాటను డిజైన్ చేశాడు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి.

ఈ మెలోడియస్ ట్రాక్‌కి సంగీతం అందించడంతో పాటు.. తానే స్వయంగా పాడాడు అనిరుధ్ రవిచందర్. అతనితో కలిసి అనుమిత నాదేశన్ ఫీమేల్ ట్రాక్ ఆలపించింది. కృష్ణకాంత్ హృద్యమైన లిరిక్స్‌ను అందించాడు. విజువల్ పరంగా కూడా పాటలో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జోడీ ఆకట్టుకుంటున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లు వేగవంతం చేస్తుంది టీమ్.




Tags

Next Story