ప్రేమకు కొత్త నిర్వచనం '8 వసంతాలు'

ప్రేమకు కొత్త నిర్వచనం 8 వసంతాలు
X
నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రేక్షకుల కోసం ఓ ప్రేమకథను తీసుకొస్తుంది. అదే ‘8 వసంతాలు‘. ఫణీంద్ర నార్సెట్టి ఎమోషనల్ లవ్ స్టోరీగా ‘8 వసంతాలు‘ చిత్రాన్ని రూపొందించాడు.

ఒకప్పుడు తెలుగులో భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాలతో పాటు.. స్వచ్ఛమైన ప్రేమకథలు ఎక్కువగా రూపొందేవి. కానీ.. టాలీవుడ్ పాన్ ఇండియా మూవీస్ పై ఫోకస్ పెట్టడంతో కమర్షియల్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు మేకర్స్. ఇక ఇలాంటి సమయంలోనూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రేక్షకుల కోసం ఓ ప్రేమకథను తీసుకొస్తుంది. అదే ‘8 వసంతాలు‘.

‘మధురం’ షార్ట్ ఫిల్మ్, ‘మను’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫణీంద్ర నార్సెట్టి ఎమోషనల్ లవ్ స్టోరీగా ‘8 వసంతాలు‘ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమాలో ‘మ్యాడ్‘ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ ప్రధాన పాత్ర పోషించింది. జీవితంలో ప్రేమ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనే పాత్రలో అనంతిక కనిపించబోతుంది. లేటెస్ట్ గా ‘8 వసంతాలు‘ ట్రైలర్ రిలీజయ్యింది.

‘ప్రేమ జీవితంలో ఒక దశ మాత్రమే.. అదే దిశ కాదు, మగాడి ప్రేమకు సాక్ష్యాలుగా భాగ్యనగరాలు ఉన్నాయి.. ఆడదాని ప్రేమకి మాత్రం జ్ఞాపకాలే సాక్ష్యం‘ వంటి డైలాగ్స్ ట్రైలర్ లో ఆకట్టుకుంటున్నాయి. రవితేజ దుగ్గిరాల, హనురెడ్డి, కన్న పసునూరి వంటి వారు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 20న ‘8 వసంతాలు‘ విడుదలకు ముస్తాబవుతుంది.



Tags

Next Story