‘అఖండ 2‘ ఆగమనానికి 50 రోజులు

‘అఖండ 2‘ ఆగమనానికి 50 రోజులు
X
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ మోస్ట్ అవైటింగ్ మూవీ ‘అఖండ 2‘. సూపర్ డూపర్ హిట్ ‘అఖండ‘కి సీక్వెల్ గా వస్తోన్న ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు.

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ మోస్ట్ అవైటింగ్ మూవీ ‘అఖండ 2‘. సూపర్ డూపర్ హిట్ ‘అఖండ‘కి సీక్వెల్ గా వస్తోన్న ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ హిట్స్ రావడంతో ‘అఖండ 2‘పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. పైగా.. ఈసారి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

తొలుత దసరా బరిలో రావాల్సిన ‘అఖండ 2‘ డిసెంబర్ 5న విడుదలకు ముస్తాబవుతుంది. అంటే.. ‘అఖండ 2‘ ఆగమనానికి ఇంకా 50 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ 50 డేస్ టు గో ‘అఖండ 2‘ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సీక్వెల్ లో దైవత్వానికి సంబంధించిన ఎపిసోడ్స్ ఎక్కువగా ఉంటాయట. వీటిలో బాలయ్య నట విశ్వరూపాన్ని అదిరిపోతుందంటున్నారు. అలాగే తమన్ అందించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ‘అఖండ 2‘కి ఎంతో ప్లస్ అవుతుందని భావిస్తోంది టీమ్. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Tags

Next Story