‘జటాధర‘ నుంచి పార్టీ సాంగ్

X
టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు ఈసారి పాన్ ఇండియా హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ‘జటాధర‘ అంటూ సోషియో ఫాంటసీ మూవీతో వస్తున్నాడు.
టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు ఈసారి పాన్ ఇండియా హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ‘జటాధర‘ అంటూ సోషియో ఫాంటసీ మూవీతో వస్తున్నాడు. సుధీర్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ తెరకెక్కిస్తున్నారు. ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తుంది.
నవంబర్ 7న విడుదలకు ముస్తాబవుతున్న ‘జటాధర‘ ప్రమోషన్స్ ఇప్పటికే షురూ అయ్యాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా‘ అంటూ సాగే పాట రిలీజయ్యింది. రాయిస్, జెయిన్, శామ్ కంపోజ్ చేసిన మ్యూజిక్ లో శ్రీమణి రాసిన ఈ పాటను స్పూర్తి జితేందర్, రాజీవ్ రాజ్ ఆలపించారు. ఈ పార్టీ సాంగ్ లో తనదైన ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టాడు సుధీర్ బాబు.
Next Story
-
Home
-
Menu