అబుదాబిలో అందాల సమంత !

సమంతా రుత్ ప్రభు ఇటీవల తన శరీరంపై ఉన్న ‘వైయంసీ’ అనే టాటూ తొలగించిన వీడియో షేర్ చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మళ్లీ ఆమె వెకేషన్ ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అబుదాబిలోని లగ్జరీ అనంతరా కసర్ అల్ సరబ్ డెసర్ట్ రిసార్ట్‌లో ఆమె సెలవులు గడుపుతూ కనిపించింది. ఆమె ట్రిప్‌లో బ్లాక్ బికినీలో టార్గెట్ ప్రాక్టీస్ చేస్తూ.. నక్షత్రాలను చూస్తూ ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన ఫోటోల్లో ఆమె రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్, ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరు ను ఫ్యాన్స్ గమనించారు. ఒక ఫోటోలో స్టార్‌గేజింగ్ సెషన్లో ఆమె పక్కన ఒక వ్యక్తి కనిపించాడు. అతని మొహం స్పష్టంగా కనిపించ కపోయినా, ఆ శిల్హౌట్ ఫ్రేమ్ రాజ్ నిడిమోరు అని అనుమానించేలా చేసింది.
సమంతా, రాజ్ గతంలో “ది ఫ్యామిలీ మ్యాన్ 2”, “సిటాడెల్: హనీ బన్నీ” ప్రాజెక్ట్‌లలో కలిసి పనిచేశారు. వీరిద్దరూ పలు సందర్భాల్లో కలిసి కనిపించడంతో డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. అయితే, వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ధృవీకరించలేదు, ఫ్యాన్స్‌ను ఊహాగానాల్లోనే ఉంచారు.
-
Home
-
Menu