గైస్ .. స్టాప్ ఇట్ ప్లీజ్ !

గైస్ .. స్టాప్ ఇట్ ప్లీజ్ !
X
పాపరాజీలు ఆమెను ఫోటోలు తీయడానికి పోటీ పడ్డారు. లైట్స్, కెమెరాలతో కంగారు పడ్డ సమంతా ఒక్కసారిగా ఇరిటేట్ అయిపోయింది. వాళ్ల వైపు తిరిగి, “గైస్.. స్టాప్ ఇట్ ప్లీట్.. ” అంటూ స్ట్రాంగ్‌గా, కాస్త సీరియస్ టోన్‌లో చెప్పేసింది.

టాలీవుడ్ అందాల హీరోయిన్ సమంతా ఇటీవల తన పర్సనల్ లైఫ్‌తో బాగా ట్రెండింగ్‌లో ఉంది. బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడమోరుతో ఆమెకు లవ్ రిలేషన్‌షిప్ ఉందన్న రూమర్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ బజ్ మధ్యలోనే సమంతా తన బేస్‌ను హైదరాబాద్ నుంచి ముంబైకి షిఫ్ట్ చేసేసింది. ఇప్పుడు ఆమె టైం ఎక్కువగా ముంబైలోనే స్పెండ్ చేస్తోంది. అప్పుడప్పుడూ హైదరాబాద్‌కి షార్ట్ ట్రిప్స్ వేస్తూ బిజీ షెడ్యూల్‌ను బ్యాలెన్స్ చేస్తోంది.

ఫిట్‌నెస్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న సమంత.. ముంబైలో తన జిమ్ రొటీన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయదు. ఆమె జిమ్ లుక్స్, కాజువల్ స్టైల్‌ను క్యాచ్ చేయడానికి పాపరాజీస్ (ఎయిర్ పోర్ట్స్ లోనూ, జిమ్ దగ్గర ఫోటోస్ తీసే ఫోటోగ్రాఫర్స్) ఎప్పుడూ రెడీగా ఉంటారు. బ్లాక్ అథ్లీజర్ , కూల్ టీ- షర్ట్‌లో ఆమె జిమ్ నుంచి బయటకు వచ్చిన పిక్స్ సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా వైరల్ అవుతుంటాయి.

సాధారణంగా సమంతా ఫ్యాన్స్‌తో, ఫోటోగ్రాఫర్స్‌తో సూపర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆమె స్మైల్, చిన్న చిన్న జెస్చర్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. కానీ, ఈ రోజు ఉదయం జరిగిన ఒక ఇన్సిడెంట్ అందరినీ షాక్‌కు గురి చేసింది. సమంతా తన రెగ్యులర్ వర్కౌట్ సెషన్ పూర్తి చేసి, ముంబైలోని జిమ్ నుంచి బయటకు వచ్చింది. ఆ టైంలో ఆమె ఫోన్‌లో సీరియస్ కాన్వర్సేషన్‌లో డీప్‌గా మునిగిపోయి ఉంది. ఇంతలో పాపరాజీలు ఆమెను ఫోటోలు తీయడానికి పోటీ పడ్డారు. లైట్స్, కెమెరాలతో కంగారు పడ్డ సమంతా ఒక్కసారిగా ఇరిటేట్ అయిపోయింది.

వాళ్ల వైపు తిరిగి, “గైస్.. స్టాప్ ఇట్ ప్లీట్.. ” అంటూ స్ట్రాంగ్‌గా, కాస్త సీరియస్ టోన్‌లో చెప్పేసింది. ఈ సీన్‌ను కెమెరాలు క్యాప్చర్ చేయడంతో, ఆ వీడియో ఇప్పుడు బాలీవుడ్ గాసిప్ ఇన్‌స్టాగ్రామ్ పేజీల్లో ఫుల్ స్పీడ్‌లో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్, నెటిజన్స్ ఈ రేర్ మూమెంట్ గురించి కామెంట్స్‌తో సోషల్ మీడియాను హీట్ చేస్తున్నారు. సమంతా ఇలా రియాక్ట్ అవ్వడం చాలా అరుదు కాబట్టి, ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హాట్ డిస్కషన్ టాపిక్‌గా మారింది. కొందరు ఆమె ప్రైవసీని రెస్పెక్ట్ చేయాలని, మరికొందరు ఆమె సీరియస్ మూడ్‌కు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Next Story