ఖుషి కపూర్ సీక్రెట్ లవ్ స్టోరీ .. ఎవరా మిస్టరీ మ్యాన్?

ఖుషి కపూర్ సీక్రెట్ లవ్ స్టోరీ .. ఎవరా మిస్టరీ మ్యాన్?
X
ఖుషి కపూర్ తాజాగా ఒక రహస్య ప్రేమ ఫొటోను షేర్ చేసి అందరిలో ఆసక్తిని కలిగించింది.

‘లవ్యాపా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న శ్రీదేవి చిన్నకూతురు ఖుషి కపూర్.. తాజాగా ఒక రహస్య ప్రేమ ఫొటోను షేర్ చేసి అందరిలో ఆసక్తిని కలిగించింది. ఆ ఫొటోలో... అద్దం ముందు సెల్ఫీ తీసుకుంటూ ఒక వ్యక్తిని హగ్ చేసుకొని ఉన్నట్టు కనిపిస్తోంది. ‘అతడు నా గ్రిడ్‌లోకి వచ్చేశాడు... త్వరలో మీ హృదయాలలోకి కూడా ప్రవేశిస్తాడు.’ అనే కేప్షన్ తో అందరికీ షాకిచ్చింది అమ్మడు. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫొటోలోని మిస్టరీ మ్యాన్ ఎవరో తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. కొందరు అది ఖుషి రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ వేదాంగ్ రైనా అని ఊహిస్తున్నారు. మరికొందరు అతడు సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రాహీం అలీ ఖాన్ కావొచ్చని అభిప్రాయపడ్డారు. ఒక అభిమాని కామెంట్ చేస్తూ.. ‘వేదాంగ్ రైనా.. ఇది నిజమేనా?’ అని ప్రశ్నించగా.. మరొకరు ‘నిజమే, ఇది వేదాంగ్ రైనా మాత్రమే’.. అని పేర్కొన్నాడు. ఇంకొకరైతే "ఇది ఇబ్రాహీం అలీ ఖాన్." అని గెస్ చేశాడు.

ఖుషి కపూర్, వేదాంగ్ రైనా ఇద్దరూ జోయా అఖ్తర్ దర్శకత్వంలో వచ్చిన ‘ది ఆర్చీస్’ మూవీ ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చాలా ఫిల్మ్ స్క్రీనింగ్స్, పార్టీలు, ఈవెంట్స్‌లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఆ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. మొత్తానికి ఖుషి కపూర్ షేర్ చేసిన ఫొటోలోని వ్యక్తి వేదాంగ్ రైనా లేదా ఇబ్రాహీం అలీ ఖాన్ అనే విషయం మాత్రం ఇంకా స్పష్టత లేదు. త్వరలో ఖుషి నిజం చెప్పే వరకు, అభిమానులు ఊహాగానాలతో సరిపెట్టుకోవాల్సిందే!

Tags

Next Story