విడాకుల వార్తలతో వైరల్ అవుతున్న కలర్స్ స్వాతి !

సినీ తారలు ప్రేమలో పడటం, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో వివాహం చేసుకోవడం.. కొంతకాలానికే విడాకులు తీసుకోవడం అనే పరిణామాలు ఎప్పుడూ జరుగుతునే ఉంటాయి. ఇప్పటికే చాలా మంది ఇలాంటి అనుభవాలు ఎదుర్కొని.. విడాకుల తర్వాత రెండో వివాహం కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో .. టాలీవుడ్ హీరోయిన్ .. ‘కలర్స్’ స్వాతి కూడా విడాకులు తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన భర్త వికాస్ వాసుతో కలసి ఉన్న ఫొటోలను డిలీట్ చేయడం, అతడిని ఆన్‌ఫాలో చేయడం వంటి చర్యల వల్ల కలర్స్ స్వాతి విడాకులు తీసుకోనుందనే సందేహానికి వచ్చారు నెటిజెన్స్. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వేడి చర్చకు దారితీస్తుండగా.. స్వాతి తదుపరి నిర్ణయం కోసం సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
“గోల్కొండ హై స్కూల్,” “స్వామి రారా,” “కార్తికేయ,” “త్రిపుర” వంటి హిట్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది స్వాతి. ఆపై మలయాళంలోనూ ‘ఆమెన్, మోసాయిలే కుదిరమీను గళ్, నార్త్ 24 కాతం, త్రిశ్శూర్ పూరం’ లాంటి సినిమాలతో మలయాళ ఆడియన్స్ ను మెప్పించింది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో వికాస్ వాసు అనే పైలట్‌ను వివాహం చేసుకుని చిత్రసీమకు కొంత దూరంగా ఉంటూ వచ్చింది. ఇటీవల.. ‘పంచతంత్రం’ అనే సినిమాతో తిరిగి రీ-ఎంట్రీ ఇచ్చిన స్వాతి.. సాయి ధరమ్ తేజ్‌తో చేసిన “సత్య” అనే పాటతో మరోసారి వార్తల్లో నిలిచింది.
-
Home
-
Menu