వైరల్ అవుతున్న అనసూయ బోల్డ్ కమ్ బ్యాక్

అనసూయ భరద్వాజ్ మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఈసారి తన సిగ్నేచర్ స్టైల్‌తో టెంపరేచర్ పెంచేసింది. కొంతకాలంగా ఫోటోషూట్‌లకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ .. సోషల్ మీడియాలో బోల్డ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. పచ్చని పొలాల మధ్య ఉన్న ఓ వాటర్ ట్యాంక్‌లో రిలాక్స్ అవుతూ తీసుకున్న కొత్త పిక్స్ పోస్ట్ చేసింది. బ్లాక్ కలర్ స్టైలిష్ మోనోకినిలో అనసూయ ఇచ్చిన మల్టిపుల్ పోజులు ఆమె ఫాలోవర్స్‌ను ఒక్కసారిగా ఎక్సయిట్ చేశాయి.
ఆమె కాన్ఫిడెన్స్, మొహమాటం లేని గ్లామర్.. నెటిజన్ల దృష్టిని బాగా ఆకర్షించాయి. దీంతో ఈ ఫోటోలు అన్ని ప్లాట్‌ఫామ్స్ లో ఫుల్ వైలర్ అయ్యాయి. ఎప్పటిలాగే, దీనిపై నెటిజన్ల నుంచి మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. చాలా మంది ఆమె బాడీ పాజిటివిటీని, బోల్డ్ స్టైలింగ్‌ను మెచ్చుకున్నారు. అయితే, కొంతమంది క్రిటిక్స్.. ఆమె ఇద్దరు పిల్లల తల్లి అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె డ్రెస్సింగ్‌ను ప్రశ్నించారు.
అయితే.. ఈ విమర్శల గురించి అనసూయ ఇంతకుముందే మాట్లాడింది. గత ఇంటర్వ్యూలలో, తన ఫ్యాషన్ సెన్స్ గురించి వచ్చే నెగిటివ్ కామెంట్స్‌ను తాను అస్సలు పట్టించుకోనని తేల్చి చెప్పింది. తాను తన కోసమే డ్రెస్ చేసుకుంటానని, సోషల్ మీడియాలో తీర్పు చెప్పే వారికి కాకుండా, తన కుటుంబానికి మాత్రమే జవాబుదారీ అని ఆమె గట్టిగా చెప్పింది.
-
Home
-
Menu