సల్మాన్ తో వంశీ ఫిక్స్!

టాలీవుడ్‌లోని టాలెంటెడ్ డైరెక్టర్స్ లో వంశీ పైడిపల్లి ఒకడు. అగ్ర కథానాయకులతోనే సినిమాలు చేసే వంశీ పైడిపల్లి తన 18 ఏళ్ల కెరీర్ లో కేవలం ఆరు సినిమాలు మాత్రమే చేశాడు. ఇక.. దళపతి విజయ్ తో చేసిన 'వారసుడు' తర్వాత ఇప్పుడు కొత్త సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడట.
లేటెస్ట్ గా వంశీ పైడిపల్లి.. సల్మాన్ ఖాన్ కోసం ఓ మాస్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేస్తున్నాడట. కథ వినగానే సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ఈ ప్రాజెక్ట్‌ను దిల్ రాజు నిర్మించబోతున్నాడని సినీ వర్గాల సమాచారం. ‘వారసుడు’ తర్వాత దాదాపు రెండు సంవత్సరాలుగా వంశీ సైలెంట్‌గా ఉన్నా, ఇప్పుడు మళ్లీ బిగ్ మూవీలోకి రీఎంట్రీకి సిద్ధమవుతున్నాడు.
సల్మాన్-వంశీ కాంబో నిజమైతే, తెలుగు – హిందీ సినీ ప్రపంచాల కలయికలో మరో భారీ క్రాస్‌ఓవర్ ప్రాజెక్ట్ ఖాయమవుతుంది. ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుందట. మొత్తంమీద.. సల్మాన్‌కి యాక్షన్ అంటే ఇష్టం, వంశీకి ఫ్యామిలీ ఎమోషన్స్‌పై మంచి పట్టుంది. అలాంటి వీరిద్దరి కాంబోలో సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
-
Home
-
Menu