విశాల్ ఆరోగ్యంపై అప్డేట్

విశాల్ ఆరోగ్యంపై అప్డేట్
X
నటుడు విశాల్ అస్వస్థతకు గురైన ఘటనపై వివిధ ప్రచారమాధ్యమాల్లో పలువిధాలుగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలైన సమాచారం ఏమిటో తెలుసుకోవాలని ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

నటుడు విశాల్ అస్వస్థతకు గురైన ఘటనపై వివిధ ప్రచారమాధ్యమాల్లో పలువిధాలుగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలైన సమాచారం ఏమిటో తెలుసుకోవాలని ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అతని హెల్త్ విషయంపై అధికారిక ప్రకటన చేసింది.

ఇటీవల విల్లుపురంలో ట్రాన్స్‌జెండర్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు విశాల్. మధ్యాహ్నం ఆయన సాధారణంగా తీసుకునే భోజనాన్ని మిస్సవడం.. ఆ స్థానంలో కేవలం జ్యూస్‌ మాత్రమే తాగడం వలన.. శరీరంలో ఎనర్జీ స్థాయి తగ్గిపోయి ఈ పరిస్థితి ఏర్పడినట్టు విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ తెలిపింది.

ప్రస్తుతం విశాల్ ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు స్పష్టం చేశారని.. తమ స్టేట్ మెంట్ లో తెలిపింది విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ.

Tags

Next Story