సమంత కొత్త ప్రయాణం!

దసరా పండగ సందర్భంగా అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది స్టార్ బ్యూటీ సమంత. 'కొత్త ప్రయాణం' అంటూ తన కొత్త ఇంటి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా నెటిజన్లలో ఆసక్తి రేకెత్తింది. ఇంటి గోడపై స్టైలిష్‌గా కనిపించిన ‘SAM’ లోగో మరింత ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ ఇల్లు హైదరాబాద్‌లోనా? ముంబైలోనా? అన్న విషయంపై సమంత ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు.
గత కొంతకాలంగా సమంత రెండో పెళ్లి వార్తలు హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో, ఆమె పోస్ట్ చేసిన ఈ 'కొత్త ప్రయాణం' అనే క్యాప్షన్ ఆ న్యూస్ కు మరింత బలం చేకూర్చింది. ముఖ్యంగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమెకు సన్నిహిత సంబంధం ఉందన్న రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్’ సిరీస్‌ల్లో కలిసి పని చేసిన సంగతి తెలిసిందే.
ఇక సినిమాల విషయానికి వస్తే, సమంత ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ: ది బ్లడీ కింగ్‌డమ్, మా ఇంటి బంగారం’ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇటీవల ఆమె నిర్మించిన హారర్ కామెడీ ‘శుభం’లో అతిథి పాత్రలో కూడా మెరిసింది. మొత్తానికి, కొత్త ఇంటితో కొత్త అడుగులు వేసిన సమంత, కెరీర్‌లోనూ వ్యక్తిగత జీవితంలోనూ మరో కొత్త చాప్టర్‌ను ఆరంభించబోతోందన్న సంకేతాలు ఇస్తోంది.
-
Home
-
Menu