‘శుభం’ భూయాత్.. సామ్ !

‘శుభం’ భూయాత్.. సామ్  !
X
“పెద్ద కలలతో... మా చిన్న ప్రేమకథను మీ ముందుకు తీసుకొస్తున్నాం... ఇది నాకు ఎంతో స్పెషల్” అని పేర్కొంది.

స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చింది. 2012లో ఈ ప్లాట్‌ఫామ్‌లో ఆమె అకౌంట్‌ ప్రారంభించినప్పటికీ, ఇటీవల ఆమె తన పాత పోస్టులన్నింటిని తొలగించి.. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో మాత్రమే యాక్టివ్‌గా ఉంది. ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ ఎక్స్ లో ఆమె తిరిగి మొదటి పోస్ట్ పెట్టింది.

తన రీ ఎంట్రీ పోస్ట్‌లో సమంత తన తొలి నిర్మాణ ప్రాజెక్ట్ గురించి తెలియజేసింది. 2023లో “ట్రలాలా మూవింగ్ పిక్చర్స్” అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన సమంత.. కొత్త టాలెంట్‌కు మద్దతుగా ఈ సంస్థను స్థాపించింది. ఆమె నిర్మాతగా మొదటి సినిమా పేరు "శుభం". ఈ చిత్రం గురించి ఓ భావోద్వేగ భరితమైన నోట్‌ షేర్ చేస్తూ.. “పెద్ద కలలతో... మా చిన్న ప్రేమకథను మీ ముందుకు తీసుకొస్తున్నాం... ఇది నాకు ఎంతో స్పెషల్” అని పేర్కొంది.

సమంత తిరిగి రావడాన్ని ఫ్యాన్స్ ఆనందంతో స్వాగతించారు. "వెల్‌కమ్ బ్యాక్ సామ్", "క్వీన్ ఈజ్ బ్యాక్" వంటి కామెంట్స్‌తో ఆమె పోస్ట్ నిండిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో 10.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. "శుభం" హారర్-కామెడీ జానర్‌కు చెందిన సినిమా. ‘సినిమా బండి’ ఫేం ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హర్షిత్ రెడ్డి, శ్రీయా కొంతం, శాలినీ కొనడేపూడి నటిస్తున్నారు. సమంత చివరిసారిగా ‘ఖుషి’ సినిమాలో విజయ్ దేవరకొండతో కలిసి నటించగా, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్‌తో కనిపించింది. ప్రస్తుతం ఆమె ‘రక్త బ్రహ్మాండ్’ ప్రాజెక్టుపై పనిచేస్తోంది.



Tags

Next Story