డెట్రాయిట్ వీధుల్లో సమంత-రాజ్!

డెట్రాయిట్ వీధుల్లో సమంత-రాజ్!
X
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న ఆమె, నాలుగేళ్లలోనే విడాకులు తీసుకొని ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తోంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న ఆమె, నాలుగేళ్లలోనే విడాకులు తీసుకొని ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇక ఇటీవల ఆమె బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్‌లో ఉందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సెట్స్‌లో మొదలైన పరిచయం ఆపై సన్నిహితంగా మారింది. ఇటీవల అమెరికాలో వీరిద్దరూ కలిసి విహరించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో సమంత, రాజ్‌ ఎంతో సన్నిహితంగా కనిపించడంతో ఈ ప్రచారానికి మరింత బలమొచ్చింది.

అయితే రాజ్ ఇప్పటికే శ్యామలి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు, శ్యామలి మాత్రం ఈ బంధాన్ని వదలలేకపోతున్నట్లు సమాచారం. తాజాగా ఈ వ్యవహారంపై ఆమె ఒక క్రిప్టిక్ పోస్టు చేసింది. 'ధర్మమే జీవితం' అనే తాత్విక సందేశంతో, ఇతరులను బాధపెట్టకూడదన్న నైతికతను ఆమె పేర్కొంది. ఈ సందేశం ప్రత్యక్షంగా ఎవరినీ టార్గెట్ చేయకపోయినా, సమంత-రాజ్ ఫొటోల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టినట్లు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, రాజ్-శ్యామలికి ఓ కూతురు కూడా ఉంది. త్వరలో రాజ్-శ్యామలీ విడాకులు తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇక రిలేషన్ షిప్ వార్తలపై సమంత, రాజ్ లలో ఎవరూ అధికారికంగా స్పందించలేదు.

Tags

Next Story