వైరల్ అవుతున్న రిషబ్ శెట్టి న్యూ లుక్

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కాంతార చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా, భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. దర్శకుడిగా గుర్తింపు పొందిన రిషబ్ శెట్టి, ఈ చిత్రంతో హీరోగానూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు.
ఇటీవల ఇతర భాషల చిత్రాలు కూడా తెలుగులో మంచి విజయాలను సాధిస్తున్నాయి. కంటెంట్ బలంగా ఉంటే, అది ఏ భాషా సినిమా అయినా తెలుగులో సూపర్ హిట్‌గా నిలుస్తోంది. మలయాళం, తమిళం, కన్నడ చిత్రాల్లో మంచి కంటెంట్ ఉన్నవాటిని తెలుగులో అనువాదం చేసి విడుదల చేయడం మనం తరచూ చూస్తున్నాం. అలాంటి విజయవంతమైన సినిమాల్లో 'కాంతార' ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
ఈ విజయంతో రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ఆయనకు వివిధ భాషా చిత్రాల నుంచి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో రిషబ్ ఓ సినిమాలో నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే, తెలుగులో 'జై హనుమాన్' అనే చిత్రంలో హనుమంతుడి పాత్రలో రిషబ్ నటించనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. 'జై హనుమాన్' ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి అద్భుతంగా కనిపిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
ఇదే సమయంలో, రిషబ్ లుక్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పొడవాటి జుట్టుతో ఉన్న ఆయన తాజా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇది 'కాంతార 2' కోసం అని కొందరు, 'జై హనుమాన్' కోసం అని మరికొందరు అంటున్నారు. అయితే, ఈ లుక్ సినిమాకోసం అయ్యుంటుందని అభిమానులు ఊహిస్తున్నారు.
-
Home
-
Menu