సెలబ్రిటీలకు పవన్ వార్నింగ్

భారత ఆర్మీ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలను కలిగించింది. ఈ సర్జికల్ స్ట్రైక్స్‌పై స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గంభీరమైన వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రతకు సంబంధించి ఇజ్రాయెల్ విధానాన్ని ఉదాహరణగా చూపిస్తూ, భారత్ కూడా అలాంటి నిర్ణయాత్మక వైఖరిని అవలంబించాలన్నారు.
ప్రస్తుతం దేశంలోని పరిస్థితుల్లో, సోషల్ మీడియా వేదికగా తెలియని సమాచారం ఆధారంగా స్పందించడం తగదని సెలబ్రిటీలను, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను హెచ్చరించారు. ‘విభజనపూరితంగా మాట్లాడటం లేదా పోస్ట్ చేయడం వల్ల దేశానికి నష్టం కలుగుతుంది. అలాంటి విషయాల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవడం తప్పదు‘ అని పవన్ తేల్చి చెప్పారు.
‘దేశ రక్షణ విషయంలో మాట్లాడేటప్పుడు పదజాలాన్ని అర్థవంతంగా, బాధ్యతతో ఉపయోగించాలి. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతీ ఒక్కరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి‘ అంటూ పవన్ కళ్యాణ్ సూచించారు.
-
Home
-
Menu