పాక్ నటుడిపై నెటిజన్లు ఫైర్!

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు ఇటీవల చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ దాడిని 'సిగ్గుచేటు'గా అభివర్ణించిన ఫవాద్, అమాయకుల ప్రాణాలను గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ పాకిస్థాన్‌కు మద్దతుగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఫవాద్ వ్యాఖ్యలకు నిరసనగా ప్రముఖ టెలివిజన్ నటి రూపాలి గంగూలీ ఘాటుగా స్పందించారు. గతంలో భారత చిత్రాల్లో నటించిన ఫవాద్ ఖాన్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ, 'అతను మన సినిమాల్లో నటించడమే మనకు సిగ్గు' అని ఎక్స్ ఖాతాలో రాసారు. అంతేకాదు, ఆయన నటించిన ‘ఖూబ్‌సూరత్, కపూర్ & సన్స్, యే దిల్ హై ముష్కిల్’ వంటి సినిమాల ప్రస్తావనతో ఆయన పైన ఘాటుగా విమర్శలు గుప్పించారు.
ఇదే సమయంలో, పాక్ కంటెంట్‌ను భారత ఓటీటీ వేదికలపై నిషేధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రూపాలి గంగూలీ స్వాగతించారు. 'ఈ సమయంలో మన డిజిటల్ సరిహద్దులు కూడా రక్షించాల్సిన అవసరం ఉంది' అంటూ మోదీ ప్రభుత్వానికి హ్యాట్సాఫ్ అన్నారు.
ఇక ఫవాద్ ఖాన్, వాణి కపూర్ నటించిన 'అబీర్ గులాల్' చిత్రం, వాస్తవానికి ఈ రోజు (మే 9) విడుదల కావలసి ఉన్నప్పటికీ, తాజా పరిణామాల నేపథ్యంలో విడుదల నిలిపివేయబడింది. భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలతో పాటు ఫవాద్ చేసిన వ్యాఖ్యలు ఈ చిత్రం విడుదలపై ప్రభావం చూపినట్టే కనిపిస్తోంది.
-
Home
-
Menu