విష్ణుపై మండిపడ్డ మనోజ్!

మంచు కుటుంబంలో చోటుచేసుకున్న కుటుంబ విభేదాలు మరోసారి వార్తల్లో నిలిచాయి. ఇటీవల తన కారు కనపడకుండా పోవడంతో పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్, ఈ వ్యవహారం వెనుక తన అన్న మంచు విష్ణు హస్తం ఉందంటూ ఆరోపించారు.
ఈ ఉదయం జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్దకు చేరుకున్న మనోజ్, గేటు వద్ద కూర్చొని నిరసన తెలిపారు. "ఇది ఆస్తి గొడవ కాదు, నాకు ఆ ఇల్లు వద్దని ఎప్పుడో తండ్రికి చెప్పాన"ని స్పష్టం చేశారు. కానీ, ఇంట్లో ఉన్న తన పెంపుడు జంతువులు, వ్యక్తిగత వస్తువుల కోసమే వచ్చానని తెలిపారు.
డిసెంబర్ నుంచి జరుగుతున్న ఈ వివాదంపై పోలీసులు ఇంకా ఛార్జ్‌షీట్ నమోదు చేయకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన సెక్యూరిటీపై దాడి జరిగినా, కార్లు తీసుకెళ్లినా, పోలీసుల నుండి స్పందన లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. కోర్టు నోటీసులు ఉన్నా.. ఇంట్లోకి అనుమతించకపోవడం తన వ్యక్తిగత స్వేచ్ఛకే భంగం అని అభిప్రాయపడ్డారు మనోజ్.
-
Home
-
Menu