మనోజ్ కి లక్ష్మి విషెస్

మనోజ్ కి లక్ష్మి విషెస్
X
ఈరోజు (మే 20) మంచు మనోజ్ పుట్టినరోజు. మంచు మోహన్ బాబు వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని బాల నటుడిగానే వెండితెరకు పరిచయమయ్యాడు మనోజ్.

ఈరోజు (మే 20) మంచు మనోజ్ పుట్టినరోజు. మంచు మోహన్ బాబు వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని బాల నటుడిగానే వెండితెరకు పరిచయమయ్యాడు మనోజ్. ఆ తర్వాత ‘దొంగ దొంగది‘ సినిమాతో హీరోగా మారిన మనోజ్.. కథానాయకుడుగా పలు విలక్షణ పాత్రలు పోషించాడు.

‘ఒక్కడు మిగిలాడు‘ సినిమా తర్వాత కెరీర్ పరంగా కాస్త గ్యాప్ తీసుకున్న మనోజ్ మళ్లీ ఇప్పుడు ‘భైరవం‘తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. మల్టీస్టారర్ గా తెరకెక్కిన ‘భైరవం‘ మే 30న విడుదలకు ముస్తాబవుతుంది. మరోవైపు తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ‘మిరాయ్‘లో బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు మనోజ్. ఈరోజు మనోజ్ బర్త్ డే స్పెషల్ గా ‘మిరాయ్‘ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇక మనోజ్ పుట్టినరోజు సందర్భంగా మంచు లక్ష్మీ సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెప్పింది. మనోజ్ నటించిన ‘భైరవం‘ చిత్రంలోని ‘దమ్ దమ్ మారే‘ పాటకు డ్యాన్స్ చేస్తూ తమ్ముడు మనోజ్ కు బర్త్ డే విషెస్ చెప్పింది లక్ష్మి. ఈ వీడియో ఆకట్టుకుంటుంది.




Tags

Next Story