‘కాంటా లగా’ షఫాలీ హఠాన్మరణం

‘కాంటా లగా’ షఫాలీ హఠాన్మరణం
X
నటి, మోడల్ షఫాలీ జరివాలా (42) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. శుక్రవారం రాత్రి ముంబైలో తన నివాసంలో ఆమె అకస్మాత్తుగా అస్వస్థతకు గురికాగా, భర్త పరాగ్ త్యాగి వెంటనే అంధేరి బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు.

నటి, మోడల్ షఫాలీ జరివాలా (42) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. శుక్రవారం రాత్రి ముంబైలో తన నివాసంలో ఆమె అకస్మాత్తుగా అస్వస్థతకు గురికాగా, భర్త పరాగ్ త్యాగి వెంటనే అంధేరి బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కూపర్ ఆసుపత్రికి తరలించారు.

2005లో విడుదలైన ‘కాంటా లగా’ రీమిక్స్ సాంగ్‌తో షఫాలీ జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ‘కాంటా లగా గర్ల్’గా ఆమెకు విపరీతమైన క్రేజ్ లభించింది. అనంతరం ‘ముజ్సే షాదీ కరోగి’ సినిమాలో నటించారు. అలాగే హిందీ బిగ్‌బాస్ 13లో పాల్గొన్నారు. పలు రియాలిటీ షోల ద్వారా కూడా ఆమె ఆకట్టుకున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో 33 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్న షఫాలీ మరణవార్తతో అభిమానులు, నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గాయకుడు మికా సింగ్ ఆమె మరణంపై స్పందిస్తూ తాను షాక్‌కు గురయ్యానని విచారం వ్యక్తం చేశారు. 2015లో షఫాలీ, నటుడు పరాగ్ త్యాగిని వివాహం చేసుకున్నారు.

Tags

Next Story