ఇట్స్ బాయ్ అగైన్ – సుహాస్ హ్యాపీ న్యూస్

ఇట్స్ బాయ్ అగైన్ – సుహాస్ హ్యాపీ న్యూస్
X
టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ జీవితంలో మధుర క్షణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఓ కుమారుడి తండ్రిగా ఉన్న ఆయనకు, మరోసారి పండంటి మగబిడ్డ పుట్టాడు.

టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ జీవితంలో మధుర క్షణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఓ కుమారుడి తండ్రిగా ఉన్న ఆయనకు, మరోసారి పండంటి మగబిడ్డ పుట్టాడు. హాస్పిటల్ లో భార్య-బిడ్డతో కలిసి దిగిన ఫొటోను “ఇట్స్ బాయ్ అగైన్” అనే క్యాప్షన్‌తో సుహాస్ షేర్ చేయగా, అది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. సినీ ప్రముఖులు, అభిమానుల శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించిన సుహాస్, మొదట కమెడియన్‌గా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించాడు. ‘కలర్ ఫోటో’తో హీరోగా మారి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’ వంటి చిత్రాలు అతనికి మంచి పేరు తీసుకొచ్చాయి. ఒక వైపు హీరోగా, మరోవైపు సహాయ పాత్రల్లోనూ మెప్పిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం సుహాస్ చేతిలో రెండు తెలుగు సినిమాలు, ఒక తమిళ సినిమా ఉన్నాయి.

Tags

Next Story