పోలీసులకు ఐబొమ్మ వార్నింగ్

పోలీసులకు ఐబొమ్మ వార్నింగ్
X
తెలుగు సినిమా పరిశ్రమకు భారీ నష్టాలను తీసుకొస్తున్న పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ ఇటీవల మరింత సంచలనంగా మారింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే, 65కి పైగా పైరసీ వెబ్‌సైట్‌లను ఉద్దేశిస్తూ పోలీసులు చర్యలు ప్రారంభించారు.

తెలుగు సినిమా పరిశ్రమకు భారీ నష్టాలను తీసుకొస్తున్న పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ ఇటీవల మరింత సంచలనంగా మారింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే, 65కి పైగా పైరసీ వెబ్‌సైట్‌లను ఉద్దేశిస్తూ పోలీసులు చర్యలు ప్రారంభించారు.

హైదరాబాద్ మాజీ సీపీ సీవీ ఆనంద్ ప్రకారం, 2024లోనే తెలుగు సినిమాలు పైరసీ వలన రూ.3,700 కోట్లు నష్టపోయాయి. పైరసీ ప్రధానంగా రెండు మార్గాల్లో జరుగుతోంది. థియేటర్లలో రహస్యంగా రికార్డింగ్ మరియు డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సర్వర్‌లను హ్యాక్ చేసి HD ప్రింట్స్ దొంగిలించడం. అంతేకాక, ఈ వెబ్‌సైట్‌లకు ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల ప్రకటనల ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు వస్తున్నాయి, ఆ లావాదేవీలు క్రిప్టోకరెన్సీలోనే ఉంటాయి. ఈనేపథ్యంలో పైరసీ వెబ్ సైట్ ‘ఐబొమ్మ‘పై కూడా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

పోలీసుల హెచ్చరికకు పైరసీ సైట్ ఐబొమ్మ డిఫరెంట్ గా స్పందించింది. ‘హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా? సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వున్నారు. వాళ్లు ఏం అయిపోతారు అని కబుర్లు చెప్పకండి. సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్స్ మరియు విదేశాలలో షూటింగ్ లకు మరియు ట్రిప్స్ కి ఖర్చుపెడుతున్నారు. అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి దానిని మా మీద రుద్ది ఎక్కువకు అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు‘ అంటూ కొన్ని పాయింట్స్ ను రెయిజ్ చేస్తూ ఓ స్పెషల్ నోట్ ఇచ్చింది ఐబొమ్మ వెబ్ సైట్.

ఒకవేళ ఐబొమ్మను టార్గెట్ చేస్తే, తాము ఎక్కడ ఫోకస్ చేయాలో కూడా తెలియజేస్తామని ఈ పైరసీ సైటు తెలిపింది. అలాగే తాము ఏ దేశంలో ఉన్నా భారతదేశం, అందులో తెలుగు వానికోసం ఆలోచిస్తాము అంటూ తమ పోస్ట్ లో తెలిపింది. ఈ సన్నివేశం చూస్తుంటే.. సినిమాలపై పైరసీకి వ్యతిరేకంగా ప్రభుత్వం, పరిశ్రమలు కఠిన చర్యలు తీసుకుంటున్నా, వెబ్‌సైట్‌లు సాంకేతికంగా చాలా ముందడుగులో ఉన్నాయని అర్థమవుతుంది. మొత్తంగా.. తెలుగు సినీ పరిశ్రమకి ఇది ఒక సీరియస్ సవాల్‌గా నిలిచిపోతుంది.

Tags

Next Story