భార్యపై తీవ్ర ఆరోపణలు చేసిన హీరో

భార్యపై తీవ్ర ఆరోపణలు చేసిన హీరో
X
కోలీవుడ్‌ హీరో జయం రవి, ఆయన భార్య ఆర్తి మధ్య కొనసాగుతున్న విడాకుల వివాదం తాజాగా తీవ్రమయ్యింది. ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేయడం, న్యాయస్థానం దాకా వ్యవహారం చేరడం కలకలం రేపుతోంది.

కోలీవుడ్‌ హీరో జయం రవి, ఆయన భార్య ఆర్తి మధ్య కొనసాగుతున్న విడాకుల వివాదం తాజాగా తీవ్రమయ్యింది. ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేయడం, న్యాయస్థానం దాకా వ్యవహారం చేరడం కలకలం రేపుతోంది. తాజాగా జయం రవి విడుదల చేసిన లేఖ ఈ వివాదానికి మరింత ఊతం ఇచ్చింది.

ఇటీవల గాయని కెనిషాతో జయం రవి ఓ పెళ్లి వేడుకలో కనిపించడం ద్వారా, ఆయన వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లోకి వచ్చింది. దీనిపై ఆర్తి స్పందిస్తూ, జయం రవి తన పిల్లలను పట్టించుకోవడం లేదని, ఇంటి నుంచి గెంటేశాడని తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే రవి దీనిపై తీవ్రంగా స్పందిస్తూ, ఆర్తే తనను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వేధించిందని, తన తల్లిదండ్రుల్ని కలిసే అవకాశాన్ని కూడా కోల్పోయానని చెప్పారు.

‘ఇది నా జీవిత కథ.. ఆట కాదు‘ అంటూ రవి తన లేఖలో బాధను వ్యక్తం చేశారు. ఆర్తి తన పిల్లలను 'ఆయుధాలా' వాడుతోందని, కల్పిత ఆరోపణలతో తన ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకంతో ఉన్నానని, ఇది తన మొదటి, చివరి స్పందన అని స్పష్టం చేశారు.

ఇతర నటీనటుల జీవితాల్లో చోటుచేసుకునే విడాకులు, విభేదాలు సాధారణమే అయినా, జయం రవి – ఆర్తి వివాదం మాత్రం వ్యక్తిగత బాధలు, బహిరంగ ఆరోపణలు కలగలిసిన ఉదంతంగా మారింది. ప్రస్తుతం ఈ వివాహం ముగిసే దిశగా కేసు కోర్టులో విచారణలో ఉంది.



Tags

Next Story