ఆర్చరీ ప్రీమియర్ లీగ్ అంబాసిడర్‌గా చరణ్

భారత ఆర్చరీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని రాసే ఘట్టం రానుంది. భారత ఆర్చరీ సంఘం (AAI) ఆధ్వర్యంలో తొలిసారిగా ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (APL) అక్టోబర్ 2 సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలోని ఆనంద్ విహార్ యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది.
ఈ వినూత్న లీగ్‌కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బ్రాండ్ అంబాసడర్‌గా ఉండటం విశేషం. ఆయనే చీఫ్ గెస్ట్‌గా హాజరై ఈ టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. భారతదేశంలో తొలిసారిగా ఫ్రాంచైజీ ఆధారిత ఆర్చరీ లీగ్ రూపుదిద్దుకుంది.
మొత్తం ఆరు జట్లలో 36 మంది భారత రికర్వ్, కాంపౌండ్ ఆర్చర్లు, అలాగే ప్రపంచ టాప్-10లో ఉన్న వారితో సహా 12 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొనడం ఈ టోర్నమెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అక్టోబర్ 2 నుంచి 12 వరకు జరిగే ఈ టోర్నమెంట్‌కి వరల్డ్ ఆర్చరీ, వరల్డ్ ఆర్చరీ ఆసియా, భారత క్రీడా మంత్రిత్వ శాఖ మద్దతు తెలిపాయి.
I’m proud to launch the first ever Archery Premier League 🏹 - a celebration of precision, power, and passion 💪
— Ram Charan (@AlwaysRamCharan) September 30, 2025
Join me on 2nd October at Yamuna Sports Complex, Anand Vihar, Delhi, or watch the event live on SonyLiv from 7:30 PM to 9:30 PM.
Wishing you all a very Happy… pic.twitter.com/DRysRn33TW
-
Home
-
Menu