యూట్యూబర్ హర్ష సాయిపై కేసు

యూట్యూబర్ హర్ష సాయిపై కేసు
X
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌కు సంబంధించిన వివాదం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా, యూట్యూబర్ హర్ష సాయి బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసులో సైబరాబాద్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘బెట్టింగ్ యాప్‌ల వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతోంది. కేవలం కొందరి లాభాల కోసం సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి వారిని మీరు ఫాలో అవుతారా?‘ అని ప్రశ్నించారు. బాధితులు సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఇటీవల పోలీసులు బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు వేగవంతం చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ఇప్పటికే బెట్టింగ్ యాప్‌ల వల్ల సమాజంపై పడుతున్న ప్రభావాన్ని సోషల్ మీడియా వేదికగా వివరిస్తూ ఉన్నారు. ఈ యాప్‌ల కారణంగా ఆర్థిక వ్యవస్థకూ హాని జరుగుతుందని హెచ్చరించారు. యువతను బెట్టింగ్ మోజు నుంచి బయటపడేలా చేయడానికి అధికార యంత్రాంగం కఠిన చర్యలు చేపడుతోంది.

https://x.com/SajjanarVC/status/1901132408495497483

Tags

Next Story