'బాహుబలి, భళ్లాలదేవ' సరదా చిట్‌చాట్!

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించిన ఎపిక్ యాక్షన్ మూవీ ‘బాహుబలి’. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం, రెండు భాగాలుగా విడుదలై సంచలన విజయం సాధించింది. తాజాగా ఈ రెండు భాగాల్నీ కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఒకే చిత్రంగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. రీ రిలీజ్‌ను పురస్కరించుకుని బాహుబలి టీమ్ సోషల్ మీడియాలో 'కట్టప్ప బాహుబలిని చంపకపోతే ఏం జరిగేది?' అనే ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. దీనికి 'అదే జరిగితే నేనే చంపేసేవాడిని' అంటూ రానా సరదాగా సమాధానమిచ్చాడు. దీనికి ప్రభాస్ స్పందిస్తూ 'దీని కోసం నేనే అలా జరగనిచ్చాను భల్లా!' అంటూ బాహుబలి 2 - రూ.1000 కోట్ల కలెక్షన్స్ పోస్టర్‌ను షేర్ చేశాడు. ప్రభాస్, రానా సరదా చాట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక 'బాహుబలి: ది ఎపిక్' రన్‌టైమ్ విషయంలో చర్చ కొనసాగుతోంది. రెండు పార్టులు కలిపితే 5.5 గంటలు ఉండగా, దాన్ని సుమారు 3.5 గంటలకు కుదించి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది.
-
Home
-
Menu