మరోసారి తప్పిన కారు ప్రమాదం!

మరోసారి తప్పిన కారు ప్రమాదం!
X
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ గానూ రిస్క్స్ చేయడానికి ఇష్టపడుతుంటాడు కోలీవుడ్ అల్టిమేట్ స్టార్ అజిత్. నటుడిగానే కాకుండా, ప్రొఫెషనల్ రేసర్‌గానూ అజిత్ పేరు తెచ్చుకున్నాడు.

రీల్ లైఫ్ లోనే కాదు రియల్ గానూ రిస్క్స్ చేయడానికి ఇష్టపడుతుంటాడు కోలీవుడ్ అల్టిమేట్ స్టార్ అజిత్. నటుడిగానే కాకుండా, ప్రొఫెషనల్ రేసర్‌గానూ అజిత్ పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల వరుసగా రేసింగ్ లో ప్రమాదాలు ఎదురవుతోన్నా.. రేసర్ గా తన సత్తా చాటుతూనే ఉన్నాడు. లేటెస్ట్ గా అజిత్ కి మరో ప్రమాదం తప్పింది. బెల్జియంలో కారు రేసులో పాల్గొన్నాడు అజిత్. ఈక్రమంలో అజిత్ కారు ట్రాక్ నుంచి పక్కకు దూసుకెళ్లింది. అయితే.. ప్రమాదం నుంచి అజిత్ సురక్షితంగా బయటపడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. ఏప్రిల్‌ 10న విడుదలైన ఈ చిత్రం తొమ్మిది రోజుల్లోనే రూ. 200 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించి అజిత్‌ కెరీర్ లో ఒన్ ఆఫ్ ది టాప్ మూవీస్ గా నిలిచింది. ఈ కలెక్షన్లను నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాకు అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించగా, అజిత్‌కు జోడీగా త్రిష నటించింది. ప్రియా ప్రకాష్ వారియర్‌, సునీల్‌, అర్జున్ దాస్‌ పాత్రలు కూడా ప్రత్యేకంగా నిలిచాయి. లాంగ్ రన్ లో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

Tags

Next Story