విమాన ప్రయాణంపై మంచు లక్ష్మి అసంతృప్తి !

విమాన ప్రయాణంపై మంచు లక్ష్మి అసంతృప్తి !
X
తాజాగా తనకు ఎదురైన ఓ అసౌకర్యాన్నీ అందరితో పంచుకుంది. ఇటీవల ఆమె ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేసింది మంచు లక్ష్మి.

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితం, కుటుంబం, ప్రాజెక్టులు, మోడలింగ్‌ వంటి విషయాలను షేర్‌ చేసే మంచు లక్ష్మి.. తాజాగా తనకు ఎదురైన ఓ అసౌకర్యాన్నీ అందరితో పంచుకుంది. ఇటీవల ఆమె ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేసింది.

తన తాజా విమాన ప్రయాణంలో ఇండిగో సిబ్బంది ప్రవర్తన తనకు తీవ్ర అసహనాన్ని కలిగించిందని మంచు లక్ష్మి తెలిపింది. "నా బ్యాగేజ్‌ను పక్కకు నెట్టి, కనీసం ఓపెన్‌ చేసుకునే అవకాశమివ్వలేదు. వారు చెప్పినట్లుగా చేయకుంటే నా బ్యాగ్‌ను గోవాలోనే వదిలేస్తామంటూ హెచ్చరించారు. నేను ఎంత రిక్వెస్ట్‌గా మాట్లాడినా, వారి నుంచి అనుకూలమైన స్పందన రాలేదు. దురుసుగా మాట్లాడారు. ఇది నాకు షాక్‌కు గురిచేసింది," అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

తనకు ఎదురైన ఇబ్బంది మరెవరికీ కలగకూడదనే ఉద్దేశంతో ఈ విషయాన్ని పంచుకున్నట్లు మంచు లక్ష్మి పేర్కొంది. "ఇది ఒక రకంగా వేధింపే. నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. బ్యాగేజ్‌కి ట్యాగ్‌ వేయకుండా లోనికి తీసుకెళ్లాలని నన్ను ఒప్పించారు. తగిన ట్యాగ్ లేకుండా నా వస్తువుల కోసం బాధ్యత ఎవరూ తీసుకోరని నాకు స్పష్టమైంది," అంటూ మంచు లక్ష్మి తెలిపింది.

తన కంటే ముందూ, తన తర్వాత ప్రయాణించిన ప్రయాణికులు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, ఎయిర్‌లైన్స్ యాజమాన్య తీరును నిర్లక్ష్యంగా పేర్కొన్నారు. "ఈ విధమైన వ్యవహార శైలితో ఎయిర్‌లైన్స్‌ నడిపించడం ఎలా సాధ్యం?" అంటూ తాను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో మంచు లక్ష్మిని సపోర్ట్ చేస్తూ కొందరు కామెంట్స్ పెట్టారు.

Tags

Next Story