నటి కల్పికపై దాడి

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో టాలీవుడ్ నటి కల్పిక గణేష్‌పై శుక్రవారం రాత్రి దాడి జరిగింది. బర్త్‌డే కేక్ విషయంలో పబ్ సిబ్బందితో జరిగిన వాగ్వాదం తీవ్రంగా మారడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. కల్పిక పబ్ నిర్వాహకులు తాను అడిగిన విషయంపై దురుసుగా ప్రవర్తించారని, బూతులు తిట్టినట్లు ఆరోపించారు. తాను ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పటికీ పోలీసులు కూడా తగిన స్పందన చూపలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వివాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోల ఆధారంగా పబ్ సిబ్బందితో కల్పికకు బర్త్‌డే కేక్ విషయమై తీవ్ర వాగ్వాదం జరిగినట్టు కనిపిస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ, సాక్షుల వాంగ్మూలాలు తీసుకుంటున్నారు.
కల్పిక గణేష్ 2009లో ‘ప్రయాణం’ సినిమా ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. 'జులాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద' వంటి చిత్రాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. పలు వెబ్ సిరీస్‌ల్లోనూ కల్పిక నటించారు.
-
Home
-
Menu