డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ అరెస్ట్

డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ అరెస్ట్
X
తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన నటుడు శ్రీరామ్ (అసలు పేరు శ్రీకాంత్) డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు.

తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన నటుడు శ్రీరామ్ (అసలు పేరు శ్రీకాంత్) డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. తిరుపతికి చెందిన శ్రీరామ్ సినిమాలపై మక్కువతో చిన్నతనంలోనే చెన్నైకి వెళ్లాడు. తమిళంలో ‘రోజా కూటం’, తెలుగులో ‘రోజా పూలు’ సినిమాతో హీరోగా పరిచయం అయిన శ్రీరామ్, 'ఒకరి ఒకరు' వంటి హిట్ సినిమాలతో గుర్తింపు పొందాడు.

తాజాగా చెన్నైలోని నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మాజీ AIADMK కార్యనిర్వాహకుడు ప్రసాద్‌ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు వచ్చిన ఆరోపణలతో, శ్రీరామ్‌ను చెన్నై పోలీసులు విచారించారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలు సేకరించారు. అనంతరం నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌కు తరలించి రెండు గంటల పాటు విచారించారు.

తెలుగులో ‘దడ, లై, నిప్పు, రావణాసుర’ వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించిన శ్రీరామ్, ఇటీవలి కాలంలో ‘హరికథ’, ‘వళరి’ వంటి వెబ్‌సిరీస్‌లలోనూ కనిపించాడు. శ్రీరామ్ అరెస్ట్‌తో సినీ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం మొదలైంది.

Tags

Next Story