బాలయ్య కాదు... ఈ సారీ నాగార్జునే !

ఇటీవల బిగ్ బాస్ తెలుగు షోకు సంబంధించిన ఓ వార్త అభిమానుల్లో ఆసక్తిని రేపింది. గత ఆరు సీజన్లుగా ఈ రియాలిటీ షోను హోస్ట్ చేస్తోన్న అక్కినేని నాగార్జునను ఈసారి తప్పించి.. నందమూరి బాలకృష్ణకు అవకాశం ఇచ్చారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవిగా తేలాయి. నాగార్జునే బిగ్ బాస్ తెలుగు 9 వ సీజన్‌కు హోస్ట్‌గా తిరిగి వస్తున్నారు. నాగార్జునతో షో నిర్వాహకుల ఒప్పందంలో ఎలాంటి మార్పు జరగలేదు. బాలకృష్ణ ఈ సీజన్‌ను హోస్ట్ చేయడం లేదని స్పష్టమైన సమాచారం. కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ కూడా హోస్ట్‌గా ఎంపిక కావచ్చనే వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ, అవి నిజం కాదని తేలిపోయింది.
బిగ్ బాస్ తెలుగు తొలి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. రెండో సీజన్‌ను నాని నిర్వహించగా, మూడో సీజన్ నుంచి ఇప్పటివరకు నాగార్జున వరుసగా హోస్ట్ చేస్తూ వచ్చారు. ఆయన మార్క్, హుందాతనంతో షోకు ఓ ప్రత్యేకత ఏర్పడింది. దీంతో ప్రేక్షకుల్లో ఆయనకు విశేషమైన ఆదరణ లభిస్తోంది.
ఇక తమిళ బిగ్ బాస్ విషయంలో, కమల్ హాసన్ స్థానంలో ఇటీవల విజయ్ సేతుపతి వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే తెలుగులోనూ మార్పు ఉంటుందేమోనని ఊహాగానాలు మొదలయ్యాయి. పైగా “అన్‌స్టాపబుల్ విత్ యన్ బీ కే” షోతో బాలకృష్ణకు వచ్చిన పాపులారిటీ కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. కానీ ఈ వదంతులన్నింటికీ తెరదించి, నాగార్జునే మరోసారి బిగ్ బాస్ తెలుగు హోస్ట్‌గా రంగంలోకి దిగుతున్నారు. అధికారికంగా ఈ విషయాన్ని నిర్వాహకులు ఖరారు చేయబోతున్నారు. ఆయన మరొక్కసారి తన ప్రత్యేకతతో షోను ముందుకు నడిపించనున్నాడు.
-
Home
-
Menu