'బిగ్ బాస్'లోకి మైక్ టైసన్?

బిగ్ బాస్లోకి మైక్ టైసన్?
X
హిందీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ కొత్త సీజన్‌ ప్రారంభానికి సిద్ధమైంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే బిగ్‌బాస్ 19 ఈరోజు (ఆగస్టు 24, ఆదివారం) రాత్రి అట్టహాసంగా ప్రారంభం కానుంది.

హిందీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ కొత్త సీజన్‌ ప్రారంభానికి సిద్ధమైంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే బిగ్‌బాస్ 19 ఈరోజు (ఆగస్టు 24, ఆదివారం) రాత్రి అట్టహాసంగా ప్రారంభం కానుంది. ప్రారంభానికి ముందే ఈ సీజన్‌పై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. కారణం ఏమిటంటే, ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన క్రీడా దిగ్గజాలు అడుగు పెట్టబోతున్నారన్న ప్రచారం.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ కెంటెస్టెంట్‌గా రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఎంట్రీకి సంబంధించిన చర్చలు దాదాపు పూర్తయ్యాయట. టైసన్ గతంలో విజయ్ దేవరకొండ నటించిన 'లైగర్' సినిమాలో కనిపించి భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

మైక్ టైసన్ తో పాటు WWE లెజెండ్ ‘ది అండర్‌టేకర్’ నవంబర్‌లో ఒక వారం పాటు ప్రత్యేక అతిథిగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తాడనే ప్రచారం కూడా జరుగుతోంది. రెజ్లింగ్‌లో 30 సంవత్సరాలకు పైగా దుమ్ము రేపిన ఆయన, 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అండర్‌టేకర్ లాంటి గ్లోబల్ ఐకాన్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తే, అది ఇండియన్ టెలివిజన్ చరిత్రలోనే ఒక సంచలనం అవుతుందనే చెప్పాలి.

ఈసారి 'బిగ్‌బాస్' సీజన్ ఏకంగా ఐదు నెలల పాటు కొనసాగనుంది. మొదటి మూడు నెలల పాటు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించి, ఫినాలేకు తిరిగి వస్తాడు. మధ్యలో కరణ్ జోహార్, ఫరా ఖాన్, అనిల్ కపూర్ తాత్కాలిక హోస్టులుగా వ్యవహరించనున్నట్లు సమాచారం.

Tags

Next Story