బిగ్‌బాస్ హౌస్‌లోకి లక్స్ పాప

తెలుగు ప్రేక్షకులకు 'లక్స్ పాప' పాట గుర్తొస్తే వెంటనే గుర్తుకు వచ్చేది ఆశా సైనీ. అయితే ఈమె అసలు పేరు ఫ్లోరా సైనీ. 1999లో 'ప్రేమ కోసం' చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన ఆమె పేరును ఆశా సైనీగా మార్చేశారట. 'నరసింహ నాయుడు' చిత్రంలోని 'లక్స్ పాప' సాంగ్‌తో ఆమె ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది. వెంటనే 'నువ్వు నాకు నచ్చావ్, ప్రేమతో రా, మైఖేల్ మదన కామరాజు, ఆ ఇంట్లో' వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
బాలకృష్ణ, వెంకటేష్, జగపతి బాబు, సుదీప్, శివరాజ్‌కుమార్, విజయకాంత్, ప్రభు, కార్తీక్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్‌ను షేర్ చేసుకుంది ఆశా సైనీ. ఇలా.. తెలుగు, తమిళం, కన్నడ, పంజాబీ, హిందీ భాషలలో కలిపి 100కి పైగా సినిమాల్లో నటించింది. కొంత కాలం తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసి అక్కడ బిజీ అయింది. హిందీలో వచ్చిన 'స్త్రీ' చిత్రంలోనూ ఈమె పాత్రకు మంచి గుర్తింపు లభించింది.
తన కెరీర్ జోరులో ఉన్న సమయంలోనే ఆశా సైనీ ప్రేమలో పడింది. కానీ ఆ ప్రేమే ఆమె జీవితాన్ని నరకంలా మారింది. 20 ఏళ్ల వయసులో ఓ ప్రముఖ నిర్మాతను ప్రేమించింది. కానీ ఆ తరువాత అతని నిజ స్వరూపం బయటపడింది. ఆశా సైనీని 14 నెలల పాటు అతను చిత్రహింసలకు గురి చేశాడు. అతను ఆమెను ముఖం, ప్రైవేట్ భాగాలపై కొట్టేవాడట. నటన వదిలేయమని బలవంతం చేసేవాడట. చివరికి ఒక రోజు పారిపోయి తల్లిదండ్రుల దగ్గరికి చేరి ప్రాణాలు దక్కించుకుందట సైనీ.
ఇక నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ సీజన్ 9 ప్రారంభమైన వేళ, రెండో కంటెస్టెంట్‌గా ఫ్లోరా సైనీ ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన వెంటనే 'నన్ను ఆశా సైనీ అని కాకుండా, ఫ్లోరా సైనీ అని పిలవండి' అంటూ నాగార్జునకు షాక్ ఇచ్చింది.
ఆమె జీవితంలోని చేదు అనుభవాలను పంచుకోవడంతో, ప్రేక్షకుల గుండెలను పిండేసింది. గ్లామర్ కోసం మాత్రమే వచ్చిందని అనుకున్నవారికి ఆమె మాటలు కన్నీళ్లు తెప్పించాయి. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఫ్లోరా సైనీ, ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో తన కొత్త ప్రయాణం ప్రారంభించింది. తన అనుభవాలను ధైర్యంగా పంచుకోవడం ద్వారా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న ఇతర మహిళలకు స్ఫూర్తినిస్తోంది.
లక్స్ పాప నుంచి 'బిగ్‌బాస్ కంటెస్టెంట్' వరకూ ఫ్లోరా సైనీ ప్రయాణం నిజంగానే ఒక సినిమా కథ కంటే ఉత్కంఠభరితం అని చెప్పొచ్చు. మరి.. బిగ్ బాస్ హౌస్ లో ఫ్లోరా సైనీ ఎలాంటి పెర్ఫామెన్స్ చూపిస్తుందో చూడాలి.
-
Home
-
Menu