'బుజ్జిగాడు' భామ ఎమోషనల్ స్టోరీ!

బుజ్జిగాడు భామ ఎమోషనల్ స్టోరీ!
X
'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ఈ సీజన్ లో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో సంజన గల్రానీ ఒకరు. ప్రభాస్ 'బుజ్జిగాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సంజన బిగ్ బాస్ 9లో 10వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది.

'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ఈ సీజన్ లో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో సంజన గల్రానీ ఒకరు. ప్రభాస్ 'బుజ్జిగాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సంజన బిగ్ బాస్ 9లో 10వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. చీరకట్టుతో, కొప్పున పూలతో స్టేజ్‌పైకి వచ్చిన సంజన, తన జీవితంలోని చేదు అనుభవాలను పంచుకుంటూ ఎమోషనల్ అయ్యింది.

సంజన గల్రానీ మొదట మోడలింగ్‌ ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహంతో చేసిన యాడ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమెను దర్శకుడు పూరీ జగన్నాథ్ గమనించి 'బుజ్జిగాడు' సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో సంజన క్యారెక్టర్ కు మంచి గుర్తింపు లభించింది.

ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో వరుస ఆఫర్లు వచ్చాయి. 'సోగ్గాడు, యమహో యమ, సర్దార్ గబ్బర్ సింగ్' వంటి చిత్రాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే..కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే 2020లో సంజన పేరు ఓ డ్రగ్స్ కేసులో బయటకు రావడం ఆమె జీవితాన్ని పూర్తిగా తారుమారుచేసింది.

చిన్న విచారణ కోసం పిలిచినా, అరెస్ట్ చేసిన విధానం తనను కుదిపేసిందని ఆమె చెప్పింది. 'ఆ సమయంలో నాకు చావు ఎందుకురాలేదో తెలియదు. నాపై వాస్తవం లేని కథనాలు వచ్చాయి. నా జీవితం, కెరీర్ రెండూ దెబ్బతిన్నాయి' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఆ తర్వాత ఆ కేసు ఫాల్స్ అని హైకోర్టు స్పష్టంగా చెప్పినా, ఆ విషయాన్ని ప్రజలకు సరిగా తెలియజేయలేదని సంజన బాధపడింది. 'కేసులో నేను తప్పు చేయలేదని నిరూపితమైంది. కానీ మీడియాలో వచ్చిన న్యూస్‌ మాత్రమే అందరికీ గుర్తుంది. నేను అలాంటి అమ్మాయిని కాదని నిరూపించుకోవడానికి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చాను' అని స్పష్టం చేసింది.

సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత సంజన వ్యక్తిగత జీవితాన్ని ఎంచుకుంది. 2021లో తన స్నేహితుడు, డాక్టర్ అజీజ్ పాషాను ప్రేమించి వివాహం చేసుకుంది. 2022లో వారికి ఒక బాబు పుట్టగా, తాజాగా ఒక పాపకు జన్మనిచ్చింది. 'నా ఐదు నెలల పాపని భర్త దగ్గర, అమ్మవాళ్ల దగ్గర వదిలి వచ్చాను. నా గురించి అందరికీ సత్యం తెలియజేయడానికి బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టాను' అని సంజన చెప్పింది.

సంజనకు బిగ్ బాస్ అనుభవం కొత్తేమీ కాదు. గతంలో కన్నడ బిగ్ బాస్ మొదటి సీజన్‌లో పాల్గొంది. ఆ అనుభవంతో ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ 9లోకి వచ్చి మళ్లీ ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యింది. బిగ్ బాస్ 9 హౌస్‌లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఉన్న ఈ సీజన్ ఇప్పటికే డ్రామా, ఎమోషన్, సర్ప్రైజ్‌లతో నిండిపోయింది.

Tags

Next Story