‘బిగ్ బాస్ 9’ ప్రమోషనల్ షూట్స్ తో నాగ్ బిజీ !

నాగార్జున అక్కినేని తన తాజా సినిమా “కుబేర” లో చేసిన పాత్రకు జనాల నుంచి వచ్చిన ట్రెమెండస్ రెస్పాన్స్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. తెలుగు లో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. నాగ్ ఇప్పటివరకూ లీడ్ హీరో రోల్స్‌లో మెప్పించినా.. ఈ మూవీతో మాత్రం స్పెషల్ క్యారెక్టర్ రోల్స్ లోకి అడుగుపెట్టారు. ఈ ట్రాన్సిషన్‌ని జనం రెండు చేతులా స్వాగతించారు. అదీ నాగ్ యాక్టింగ్ మ్యాజిక్.
ఈ సక్సెస్ వేవ్‌ని ఎంజాయ్ చేస్తూనే.. నాగార్జున ఇప్పుడు తన టీవీ కమిట్‌మెంట్స్‌పై ఫోకస్ షిఫ్ట్ చేశారు. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకి ఆయన హోస్ట్ గా చాలా సీజన్లుగా కొనసాగుతున్నారు. ఈ షో ఫ్యాన్ బేస్ అంటే మామూలుగా ఉండదు. టీఆర్పీ రేటింగ్స్‌లో ఎప్పుడూ టాప్‌లో ఉంటుంది. ఇప్పుడు సెప్టెంబర్‌లో కొత్తగా స్టార్ట్ కానున్న తొమ్మిదో సీజన్ కోసం నాగ్ ఫుల్ రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సీజన్ కోసం కూల్ ప్రమోషనల్ కంటెంట్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. రాబోయే కొన్ని నెలలు ఈ షోకి డెడికేటెడ్‌గా టైమ్ స్పెండ్ చేయనున్నారు. అంటే, హోస్ట్‌గా నాగ్ మళ్లీ తన చార్మ్‌తో జనాలను అలరించడానికి సిద్ధం.
అటు సినిమాల విషయానికొస్తే, నాగార్జున సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న “కూలీ” మూవీలో విలన్ గా నటిస్తున్నారు. ఈ పాత్ర నాగ్‌కి కొత్త టెరిటరీ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి సంబంధించిన తన పోర్షన్స్‌ని ఆయన ఇప్పటికే కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ ఆగస్ట్ 14, 2025న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. రజనీ-నాగ్ కాంబో అంటే ఫ్యాన్స్‌కి పండగే, సినిమా థియేటర్స్‌లో ఫుల్ హంగామా ఖాయం.
-
Home
-
Menu