బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ లిస్ట్!

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ లిస్ట్!
X

బుల్లితెర రియాల్టీ షో ‘బిగ్ బాస్ తెలుగు 9’ సెప్టెంబర్ 7 సాయంత్రం 7 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో, అలాగే జియోహాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా గ్రాండ్ లాంచ్ కానుంది. హోస్ట్‌గా కింగ్ నాగార్జున హంగామా చేయనున్నారు.

ఈసారి ప్రత్యేకతలు విషయానికొస్తే తొలిసారిగా డబుల్ హౌస్ కాన్సెప్ట్. సెలబ్రిటీలు + కామనర్లు కలసి పోటీ పడనున్నారు. ప్రీ-షోగా ‘అగ్నిపరీక్ష’ నిర్వహించారు. ఇందులో 45 మంది కామనర్లు పోటీపడగా, 15 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. అందులోంచి గెలిచిన 4-5 మంది మెయిన్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారు.

అగ్నిపరీక్ష నుంచి హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఉన్నవారు. మాస్క్ మెన్ హరీష్, పవన్ కళ్యాణ్, శ్రీజా, ప్రియా శెట్టి లేదా పవన్ డెమాన్, నాగ ప్రశాంత్ లేదా మనీష్

సెలబ్రిటీ కంటెస్టెంట్స్ వినిపిస్తున్న లిస్ట్ లో జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్, కమెడియన్ సుమన్ శెట్టి, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య, సీరియల్ నటుడు భరణి శంకర్, హీరోయిన్ ఆశా షైనీ, సీరియల్ నటి తనూజా గౌడ, ఫోక్ సింగర్ రాము రాథోడ్ (‘రాను బొంబాయి రాను’ ఫేమ్), హీరోయిన్ సంజనా గల్రానీ, కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ, యాక్టర్ హర్షిత్ రెడ్డి, జుబేదా సుల్తానా (కమెడియన్ అలీ భార్య).

ఇంకా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఇతర పేర్లు.. దీపిక, కావ్య, తేజస్విని, శివకుమార్, రీతూ చౌదరి, కల్పిక గణేష్, సుమంత్ అశ్విన్, సాయి కిరణ్, సాకేత్ మొదలైన వారు.

ఈసారి మైండ్ గేమ్స్‌తో పాటు ఫిజికల్ టాస్కులు కూడా ఎక్కువగా ఉండనున్నాయి.15 మందికిపైగా కంటెస్టెంట్లు రెండు వేర్వేరు హౌస్‌లలో విడిపోయి ఉంటారు. షోలో సస్పెన్స్, రహస్య ఎంట్రీలు కూడా ఉంటాయని సమాచారం. మొత్తానికి, బిగ్ బాస్ తెలుగు 9 కొత్త ఫార్మాట్, కొత్త డ్రామా, కామనర్లు–సెలబ్రిటీలు కలయికతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

Tags

Next Story