‘ది స్మైల్ మేన్’ రివ్యూ

‘ది స్మైల్ మేన్’ రివ్యూ
X

చిత్రం పేరు : ‘ది స్మైల్ మేన్’

నటీనటులు: శరత్ కుమార్, కళైఅరసన్, శ్రీకుమార్, సిజా రోజ్, సురేష్ చంద్ర మీనన్, ఇనయ, జార్జ్ మరియన్, హరీశ్ పేరడీ, రాజ్ కుమార్ తదితరులు

భాష : తమిళం ( తెలుగు డబ్బింగ్)

ఓటీటీ ప్లాట్ ఫామ్ : ఆహా

సినిమాటోగ్రఫీ : విక్రమ్ మోహన్

సంగీతం : గవాస్కర్ అవినాశ్

నిర్మాణం : మేగ్నమ్ మూవీస్, క ఫిల్మ్ కంపెనీ

దర్శకత్వం : శ్యామ్ ప్రవీణ్

తమిళ సీనియర్ స్టార్ శరత్ కుమార్ 150వ చిత్రం ‘ది స్మైల్ మేన్’. ఆయన ప్రధాన పాత్రలో నటించినఈ చిత్రం ఇప్పుడు ఆహా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఇదొక సైకో థ్రిల్లర్, మిస్టరీ నేపథ్యంలో సాగుతూ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. అయితే, ఈ సినిమా ప్రేక్షకులకు ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతుంది? ఏ మేరకు మెప్పిస్తుంది అనే విషయాలు రివ్యూలో చూద్దాం.

కథ:

చిదంబరం (శరత్ కుమార్) అనే ఒక సీనియర్ సీఐడీ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది కథ. అతను తన కెరీర్‌లో ఎన్నో విచారణలు పూర్తి చేసిన ప్రతిభావంతుడు. ఐదేళ్ల క్రితం జరిగిన ఓ హత్యానంతరం.. అతను దొంగతనంగా హత్యలు చేసే ఓ సైకో కిల్లర్‌ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ కేసు విచారణలో అతనికి తీవ్ర గాయాలు అవుతాయి.

ఈ దాడి కారణంగా చిదంబరం మెదడు పనిచేయడం తగ్గి, అతనికి ఆల్జీమర్స్ రావడం ప్రారంభమవుతుంది. దీని వల్ల అతని గత జ్ఞాపకాలు తుడిచిపెట్టుకుపోతూ ఉంటాయి. అతను మరచిపోయే కొద్దీ తన గత జీవితం, తన కేసులు అన్నీ కను మరుగవుతుంటాయి. అయితే, ఐదేళ్ల తర్వాత అదే హత్యల పేట్రన్ మళ్లీ ప్రారంభమవుతుంది. చిదంబరం తను మళ్లీ విచారణ చేపట్టి అసలు సైకో కిల్లర్ ఎవరనే విషయం ఎలా తేల్చాడు అనేది మిగతా కథ.

విశ్లేషణ:

సినిమా తొలి భాగంలో కథను చాలా నెమ్మదిగా నడిపిస్తారు. కథ ప్రారంభం చిదంబరం వ్యక్తిత్వాన్ని, అతని గతాన్ని పరిచయం చేస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. కానీ కథ నడుస్తున్న కొద్దీ కొన్ని దృశ్యాలు ల్యాగ్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది.

సైకో థ్రిల్లర్‌గా ఈ సినిమా చాలా మంచి స్థాయిలో ఉండొచ్చు, కానీ స్క్రీన్‌ప్లేలో కొన్ని పాయింట్స్ మరీ సులభంగా ఊహించగలిగినవిగా అనిపిస్తాయి. ముఖ్యంగా, సైకో కిల్లర్‌ని పరిచయం చేసే విధానం కొత్తగా ఏమీ అనిపించదు.

ఈ సినిమాలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సైకలాజికల్ థ్రిల్ కలిసి వచ్చినప్పటికీ, కథ చెప్పే విధానంలో కొంత చోట్ల తడబాటు కనిపిస్తుంది. ముఖ్యంగా, చిదంబరం ఆల్జీమర్స్ సమస్యను మరింత ఆసక్తికరంగా చూపించాల్సిన అవసరం ఉంది. అతని సమస్య కథలో ప్రధానంగా ఉంటే, మరింత కొత్తగా అనిపించేది.

హంతకుడు తను చంపినవారి పెదవి చుట్టూ చర్మం వలిచేసి.. వారి ముఖాల్ని నవ్వుతున్నట్టుగా చేస్తాడు. అందుకే ఈ హంతకుడ్ని స్మైల్ మేన్ అని పిలుస్తారు. అయితే ఆ విధానం భయంకరంగా అనిపిస్తుంది కానీ.. ఎక్కడా వాళ్ళు నవ్వుతున్న భావన అయితే కలగదు.

నటీనటుల పెర్ఫార్మెన్స్ :

సీనియర్ నటుడు శరత్ కుమార్ ఈ సినిమాలో తన అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నారు. చిదంబరం పాత్రకు జీవం పోసేలా ఆయన నటన అద్భుతంగా ఉంటుంది. మానసిక క్షీణతతో బాధపడుతున్న పోలీస్ ఆఫీసర్‌గా, అతను తన నటనలో పూర్తి నైపుణ్యం ప్రదర్శించారు. ముఖ్యంగా, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకు ప్లస్ పాయింట్. సైకో కిల్లర్ పాత్రలో నటించిన కలైయరసన్ తన పాత్రను నమ్మకంగా పోషించినా, అతని పాత్ర తీరు మాత్రం చాలా సినిమాల్లో చూసిన ఫీలింగే కలుగుతుంది. గతంలో వచ్చిన సైకో థ్రిల్లర్ సినిమాల మాదిరిగా అతని మోటివ్‌ను డిజైన్ చేశారు. ఇంకా పోలీస్ కమిషనర్ పాత్రలో కుమార్ నటరాజన్, సహాయ పోలీస్ ఆఫీసర్‌గా శ్రీకుమార్, ఇతర సహాయ పాత్రల్లో జార్జ్ మరియన్, ప్రియదర్శిని రాజ్ కుమార్ తదితరులు తమ పాత్రలను బాగా పోషించారు.

టెక్నికల్ సపోర్ట్:

సినిమాటోగ్రఫర్ సైకో థ్రిల్లర్ అట్మాస్ఫియర్ బాగా పండించారు. కెమెరా వర్క్ చాలా నెమ్మదిగా.. గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ముఖ్యంగా, డార్క్ షేడ్స్ ఎక్కువగా ఉపయోగించి చిత్రీకరించారు. రాత్రి సమయంలో వచ్చే హత్యా దృశ్యాలను అత్యంత ఉత్కంఠభరితంగా చూపించే ప్రయత్నం చేశారు.

ఈ తరహా థ్రిల్లర్‌లకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా ముఖ్యమైనది. కానీ గవాస్కర్ అవినాష్ అందించిన మ్యూజిక్ కొంతవరకు మంచిగా అనిపించినా, కొన్ని కీలక సన్నివేశాల్లో థ్రిల్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ మరీ స్లోగా నడవడం వల్ల సినిమా సెకండ్ హాఫ్ కొంత నిడివి ఎక్కువగా అనిపిస్తుంది. దీనిని మరింత క్రిస్ప్‌గా ఉంటే ఇంకా గ్రిప్పింగ్‌గా అనిపించేదని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్

శరత్ కుమార్ నటన సినిమాకు బలమైన ప్లస్

సైకో థ్రిల్లర్ కథా నేపథ్యం ఆసక్తికరంగా ఉంటుంది

మంచి విజువల్స్, థ్రిల్లింగ్ యాంగిల్

మైనస్ పాయింట్స్

స్క్రీన్‌ప్లే చాలా చోట్ల నెమ్మదిగా సాగుతుంది

కొన్ని లాజిక్ లోపాలు ఉండటంతో కథలో అండర్‌డెవలప్‌మెంట్ అనిపిస్తుంది

విలన్ మోటివ్ చాలా సాదాసీదాగా ఉండటంతో గ్రాండ్ ఫీలింగ్ ఇవ్వదు

చివరగా..

‘ది స్మైల్ మాన్’ సైకో థ్రిల్లర్ సినిమా. ఇది కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలతో ఉత్కంఠగా సాగినా.. కథనం మరింత మెరుగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. కథా వస్తువు కొత్తదే అయినా, కథ చెప్పే విధానం చాలా స్టాండర్డ్ ఫార్మాట్‌లో ఉంటుంది. సైకో థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు, శరత్ కుమార్ నటనను ఆస్వాదించేవారు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథల్ని ఆసక్తిగా చూస్తే చూసేవారు తప్పక చూడాల్సిన సినిమా.

Tags

Next Story