‘రెట్రో’ ట్విట్టర్ రివ్యూ

‘రెట్రో’ ట్విట్టర్ రివ్యూ
X
సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ చిత్రం తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా విడుదలైంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో ఈ సినిమాపై మంచి రివ్యూస్ వస్తున్నాయి.

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా ఈ రోజే థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన ఈ రొమాంటిక్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ చిత్రం తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. పూజా హెగ్డే కథానాయికగా నటించగా, ప్రకాశ్ రాజ్, జోజు జార్జ్, నాజర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో మెరిశారు. సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ చిత్రం తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా విడుదలైంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో ఈ సినిమాపై మంచి రివ్యూస్ వస్తున్నాయి.

సూర్య నటన రెట్రో చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిందని టాక్. ఈ చిత్రం "అదిరిపోయే మాస్ సూర్య షో" అంటున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ సిగ్నేచర్ స్టైల్ స్క్రీన్‌ప్లే అండ్ డైరెక్షన్ అంటూ కొనియాడుతున్నారు. ఈ చిత్రంతో సూర్య థియేటర్లలో బలమైన కంబ్యాక్ ఇచ్చాడని అభిప్రాయ పడుతున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయని, పూజా హెగ్డే నటన సూర్యకు సమానంగా ఉండగా, సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూస్‌బంప్స్ తెప్పించిందని చెబుతున్నారు.

రెట్రో కథ సూర్య పోషించిన గ్యాంగ్‌స్టర్ పాత్ర చుట్టూ తిరుగుతుందని, తన భార్య రుక్మిణి (పూజా హెగ్డే) కోసం గత జీవితం నుంచి బయటపడే ప్రయత్నంలో ఎదురయ్యే సవాళ్లను ఆసక్తికరంగా చూపించారని కొందరు వ్యాఖ్యానించారు. కార్తీక్ సుబ్బరాజ్ మేకింగ్ కొత్త జానర్‌లో ఆడియన్స్‌కు ఫ్రెష్ అనుభూతినిచ్చిందని చెబుతున్నారు.

తెలుగు హీరోలు సాయి ధరమ్ తేజ్, విజయ్ దేవరకొండ వంటి సెలబ్రిటీలు సూర్య, రెట్రో టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ దేవరకొండ సూర్య నటనను ప్రశంసిస్తూ, సినిమా బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకున్నారు. మొత్తమ్మీద, రెట్రో సినిమా సూర్య నటన, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం, సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో Xలో ప్రశంసలు అందుకుంటోంది.

మొత్తం మీద రెట్రో చిత్రాన్ని సూర్య అభిమానులు థియేటర్లలో సూర్య బలమైన కంబ్యాక్‌గా భావిస్తున్నప్పటికీ, సినిమా బాక్సాఫీస్ విజయం రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. ఈ సినిమా గానీ సూపర్ సక్సెస్ అయితే .. ఎంతో కాలంగా సరైన హిట్స్ లేని సుూర్యకు నిజంగా రెట్రో విజయం మంచి ఊరటే అని చెప్పాలి.

Tags

Next Story