
'సితారే జమీన్ పర్' మూవీ రివ్యూ

నటీనటులు: అమీర్ ఖాన్, జెనీలియా దేశ్‌ముఖ్, ఆరోష్ దత్తా, గోపీ కృష్ణన్ వర్మ, వేదాంత్ శర్మ తదితరులు
సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ రెడ్డి
సంగీతం: శంకర్ మహదేవన్, ఎహసాన్ నూరానీ, లాయ్ మెండోన్సా, జీ మ్యూజిక్ కంపెనీ
ఎడిటింగ్ : చారు శ్రీ రాయ్
నిర్మాతలు: ఆమిర్ ఖాన్, అపర్ణ పురోహిత్
దర్శకత్వం: ఆర్.ఎస్. ప్రసన్న
విడుదల తేది: జూన్ 20, 2025
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మళ్లీ తెరపైకి వచ్చిన చిత్రం 'సితారే జమీన్ పర్'. అమీర్ బ్లాక్ బస్టర్ మూవీ ‘తారే జమీన్ పర్’కు సీక్వెల్‌గా రూపొందిన సినిమా ఇది. అయితే ‘సితారే జమీన్ పర్‘ చిత్రాన్ని స్పానిష్ మూవీ ‘ఛాంపియన్స్’ (2018) ప్రేరణతో తెరకెక్కించారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పై ఆర్.ఎస్.ప్రసన్న దర్శకత్వం వహించిన 'సితారే జమీన్ పర్' ఈరోజు విడుదలైంది. మరి.. ఈ సినిమా ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
గుల్షన్ (ఆమీర్ ఖాన్) ఒక స్వార్థపరుడు. జీవితంలో అహంకారంతోనే ఎదిగిన వ్యక్తి. భార్య సునీతా (జెనీలియా) పిల్లలు కావాలనుకుంటుంది. కానీ అతను పట్టించుకోడు. ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులో పట్టుబడి, శిక్షగా మానసిక వికలాంగులైన యువకులతో కూడిన బాస్కెట్‌బాల్ జట్టుకు కోచ్‌గా నియమించబడతాడు. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొనే సవాళ్లేంటి? ఆ జట్టుతో అతను గడిపే క్షణాలు చివరకు అతనిలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయి? అనేది కథ.
విశ్లేషణ
‘తారే జమీన్ పర్‘కి సీక్వెల్ గా వచ్చిన ‘సితారే జమీన్ పర్‘ కూడా అదే తరహా ఎమోషన్స్ తో సాగుతుంది. ఈ సినిమాలో కామెడీ, డ్రామా, మెస్సేజ్ అన్నింటినీ సమపాళ్లలో రంగరించి ఓ పర్ఫెక్ట్ మూవీగా అందించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ ఆర్.ఎస్.ప్రసన్న.
మానసిక వికలాంగులైన యువకుల జీవితాలను, వారి సామర్థ్యాలను గౌరవించే విధంగా చిత్రీకరించిన ఈ సినిమా, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశం ఇవ్వాలనే సందేశాన్ని అంతర్లీనంగా అందిస్తుంది. ‘తారే జమీన్ పర్’ సినిమా డిస్లెక్సియా గురించి అవగాహన కల్పించినట్లే, ఈ సినిమా మానసిక వికలాంగుల గురించి సున్నితమైన సందేశాన్ని ఇస్తుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
ఆమిర్ ఖాన్ గుల్షన్ పాత్రలో జీవించాడని చెప్పొచ్చు. కోపిష్టిగా మొదలై.. క్రమంగా జట్టు సభ్యులతో భావోద్వేగ బంధాన్ని పెంచుకునే పాత్రలో అద్భుతంగా నటించాడు. జెనీలియా పాత్ర పరిధి మేరకు బాగుంది. మానసిక వికలాంగులుగా నటించిన పిల్లలంతా తమ పాత్రల్లో జీవించారు.
ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం సినిమాకు ప్రధాన బలం. బాస్కెట్‌బాల్ సన్నివేశాలు, కామెడీ సీన్స్, ఎమోషనల్ సీక్వెన్సెస్ అన్నీ సరిగ్గా హ్యాండిల్ చేశాడు. శంకర్-ఎహసాన్-లాయ్ త్రయం మ్యూజిక్ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ ను బాగా ఎలివేట్ చేసింది.
చివరగా
‘సితారే జమీన్ పర్‘.. మరో సందేశాత్మక చిత్రం
Telugu 70mm Rating: 3/5
-
Home
-
Menu