'రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' మూవీ రివ్యూ

రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ మూవీ రివ్యూ
X

సుమారు 31 సంవత్సరాల క్రితం జపనీస్ యానిమే స్టైల్ లో వాల్మీకి రామాయణం ఆధారంగా తీసుకుని 'రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' పేరున రామాయణాన్ని సినిమా గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు చిత్ర బృందం.జపాన్ కు చెందిన కోయిచి ససకి, యుగో సాకి అలాగే భారతదేశానికి చెందిన రామ్ మోహన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.31 సంవత్సరాల క్రితమే జపాన్ లో విడుదలయిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఇండియాలో రిలీజ్ కాలేదు.ఇప్పుడు గీక్ పిక్చర్స్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్, ఏ ఏ ఫిలిమ్స్ కలిసి సంయుక్తంగా తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఇండియాలో జనవరి 24వ తేదీన విడుదల చేయడం జరిగింది.

కథ:

వాల్మీకి రచించిన రామాయణాన్ని ఆధారంగా చేసుకుని యానిమేషన్ స్టైల్లో జపాన్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఈ సినిమాలో శ్రీరాముల వారు 15 సంవత్సరాల నుంచి రామ రావణుని యుద్ధం, పట్టాభిషేకం వరకు ఏదైతే జరిగిందో దానిని ఏ చిత్రంలో చూపించడం జరిగింది. రాములవారు సీతాదేవి కోసం విళ్లును వంచడం, 14 సంవత్సరాల వనవాసం, దశరథ మహారాజు మరణించడం, రావణుడు సీతాదేవిని అపహరించడం, రామ రావణుని మధ్య జరిగిన యుద్ధం ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎంతో చక్కగా రూపొందించారు.

విశ్లేషణ:

ఇప్పటివరకు ఎన్ని సినిమాలు రామాయణాన్ని చూపించే విధంగా మన ముందుకి వచ్చినా సరే ప్రతి సినిమాని కూడా ప్రేక్షకులు అంతే ప్రేమతో ఆదరిస్తున్నారు. ప్రస్తుతం జపనీస్ యానిమేషన్ స్టైల్లో వచ్చిన ఈ రామాయణాన్ని కూడా అంతే ప్రేమతో ఆదరిస్తున్నారు. ఈ సినిమాను 1993లో రూపొందించడం జరిగింది. మరి అప్పట్లో గ్రాఫిక్స్ కానీ యానిమేషన్ కానీ ఇలాంటివి చేయడం అంటే చాలా గొప్ప విషయంలో చెప్పాలి కదా. అయినప్పటికీ ఎక్కడ కూడా ఆ తేడాను కనిపించకుండా ఒరిజినాలిటీకి దగ్గరగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు కూడా ఎక్కడ తగ్గకుండా చూసుకొని సినిమాని ఎంతో చక్కగా చూపించారు. అందులోనూ 4k లో విడుదల చేయడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం.

సారాంశం:

ఇప్పుడున్న జనరేషన్ ఇలాంటి యానిమేషన్ పిక్చర్స్ అంటే ఎంతో ఇష్టపడుతున్నారు. మరి 'రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' సినిమాను యానిమేషన్ రూపంలో తీసుకురావడం వల్ల పిల్లలు కూడా రామాయణాన్ని తెలుసుకుంటారు. సకుటుంబ సపరి వార సమేతంగా చూడదగ్గ సినిమా ల ఉంది.

Tags

Next Story