‘హిట్ 3’ ట్విట్టర్ రివ్యూ

నేచురల్ స్టార్ నానీ హీరోగా, హిట్ ఫ్రాంచైజీలోని మూడో చిత్రంగా తెరకెక్కిన చిత్రం హిట్ 3. ఈ సినిమా ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చింది. శైలేష్ కొలను దర్శకత్వంలో, శ్రీనిధి శెట్టి కథానాయికగా రూపొందిన ఈ చిత్రం గురించి ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.
నాని అద్భుత నటన, ఊహించని క్లైమాక్స్ సర్‌ప్రైజ్” సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నాని-శ్రీనిధి శెట్టి జోడీ స్క్రీన్‌పై అద్భుతంగా కనిపించిందని, సినిమా ఏకగ్రీవంగా కమర్షియల్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుందని అంటున్నారు. నాని మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్”తో బ్లాక్‌బస్టర్ కొట్టాడని అంటున్నారు. నాని తన పాత్రలో జీవించాడని, యాక్షన్ సన్నివేశాల్లో అతని శక్తివంతమైన నటన సినిమాను నిలబెట్టిందని చాలా మంది అభిప్రాయపడ్డారు.
హింసతో నిండిన యాక్షన్ థ్రిల్లర్”గా సినిమా ఆకట్టుకున్నప్పటికీ, ఫస్ట్ హాఫ్ సాధారణంగా సాగిందని, సెకండ్ హాఫ్‌లో ‘స్క్విడ్ గేమ్’ తరహా సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయని తెలిపారు. కథ అంచనాలకు తగ్గట్టు సాగినప్పటికీ, సంగీతం సాధారణంగా ఉందని, ఫ్యామిలీ ప్రేక్షకులకు సినిమా అంతగా సూటవ్వకపోవచ్చని చెబుతున్నారు.
మొత్తానికి ‘హిట్ 3’ ఒక శక్తివంతమైన యాక్షన్ థ్రిల్లర్‌గా ఎక్స్ వేదికగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. నాని నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లగా, స్టైలిష్ ప్రజెంటేషన్, ఉత్కంఠభరిత క్లైమాక్స్ యాక్షన్ సినిమా ప్రియులను ఆకట్టుకునే అంశాలుగా నిలిచాయని టాక్.
-
Home
-
Menu