'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ రివ్యూ

గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రివ్యూ
X
కోలీవుడ్ అల్టిమేట్ స్టార్ అజిత్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ సినిమాని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం.

నటీనటులు: అజిత్, త్రిష, సునీల్, ప్రసన్న, ప్రభు, అర్జున్ దాస్, యోగి తదితరులు

సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజం

సంగీతం: జివి ప్రకాష్ కుమార్

ఎడిటింగ్‌: విజయ్ వేలుకుట్టి

నిర్మాతలు: మైత్రి మూవీ మేకర్స్

దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్

విడుదల తేది: 10-04-2025

కోలీవుడ్ అల్టిమేట్ స్టార్ అజిత్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ సినిమాని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. అజిత్ గత చిత్రం 'పట్టుదల' ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఇక అజిత్ కి వీరాభిమాని అయిన అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి.. ఈ సినిమా ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ

భయంకరమైన గ్యాంగ్‌స్టర్ అయిన ఏకే (అజిత్ కుమార్), తన భార్య రమ్య (త్రిష) కోసం అన్ని తప్పుదారులు వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. పోలీసులకు లొంగిపోయి, తన చేసిన తప్పులకు శిక్ష అనుభవించేందుకు జైలుకు వెళ్లిపోతాడు. కానీ అతడు ఊహించినట్టు జీవితం సాగదు. గతంలో చేసిన తప్పులు అతన్ని విడిచిపెట్టవు.

జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత, సాధారణ జీవితాన్ని గడపాలనుకుంటున్న ఏకేను అతని గతం వెంటాడుతుంది. ఈ క్రమంలో అతని కుమారుడు ఓ పెద్ద సమస్యలో చిక్కుకుంటాడు.ఈ పరిస్థితి ఏకే ను మళ్లీ తన పాత స్వరూపంలోకి తీసుకువస్తుంది. అప్పుడే మళ్లీ గ్యాంగ్‌స్టర్ ఏకే మేల్కొంటాడు. ఇంతకీ ఎవరు అతని కుమారుడిని టార్గెట్ చేశారు? చివరకు తన కొడుకును రక్షించాడా? అనేది మిగతా కథ.

విశ్లేషణ

అజిత్ అభిమానులు 'విడాముయార్చి' (పట్టుదల) సినిమాతో చాలా నిరాశ చెందారు. ఆయన మళ్లీ ఓ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ తో గ్రేట్ కమ్‌ బ్యాక్ ఇవ్వాలని కోరుకున్నారు. అభిమానులను అంచనాలను 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కొంతవరకూ నెరవేర్చిందనే చెప్పొచ్చు.

ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ అజిత్ కుమార్ మాత్రమే. అజిత్ స్క్రీన్‌ ప్రెజెన్స్‌, మాస్‌ యాక్షన్‌, స్టైల్‌, స్వాగ్‌ అన్నీ కలిపి అభిమానులను ఆకట్టుకుంటాయి. కానీ కథను చూస్తే ఇది చాలా ఓల్డ్ టెంప్లేట్. మారిపోయిన గ్యాంగ్‌స్టర్, సమస్యలు, మళ్లీ గ్యాంగ్‌స్టర్‌ అవతారం.

దర్శకుడు ఎక్కువగా స్లో మోషన్ షాట్లు, హీరో ఎలివేషన్ సన్నివేశాలపై ఆధారపడ్డాడు. అజిత్‌ని గ్రాండ్‌గా చూపించడంలో అధిక్ విఫలమయ్యాడు అనలేం. కానీ సినిమాకి అవసరమైన కథా కథనం లోపించడంతో, ఆ ఎలివేషన్లు కొంతసేపటికే ప్రభావాన్ని కోల్పోతాయి. ఏకధాటిగా అజిత్ కుమార్ పాత్ర చుట్టూ హైప్ క్రియేట్ చేయడం, గ్యాంగులు ఎదురుగా రావడం, ఫారిన్ గ్యాంగులు భయపడటం.. ఇవన్నీ మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూ బోరుకొట్టిస్తాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

ఈ సినిమాలో అజిత్ కుమారే ప్రధాన ఆకర్షణ. మిగిలిన అంశాలన్నీ కొంత మేరకు ఫ్లాట్‌గా, కొంతగా క్రింజ్ ఫీల్ కలిగించేలా ఉన్నాయి. అయితే, అజిత్ డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తూ, ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లో అభిమానులను ఆకట్టుకుంటాడు. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అజిత్ ఒన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు.

త్రిష పాత్ర చిన్నదే. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సిమ్రాన్ పాత్ర కూడా పెద్దగా ప్రభావం చూపించదు. సునీల్, ప్రసన్న పాత్రలకు మంచి స్కోప్ దొరికింది. ఇంకా అర్జున్ దాస్, జాకీ ష్రాఫ్, టిను ఆనంద్, ప్రియా ప్రకాష్ వారియర్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా జీవి ప్రకాష్‌ సంగీతం బాగున్నా.. చాలా సీన్లకు అనుకున్నంత ఎమోషనల్ గ్రావిటీ లేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువగా ఓవర్ డోస్ లా అనిపిస్తుంది. ముఖ్యంగా ఎలివేషన్ సీన్స్ లో, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లో మ్యూజిక్ సినిమా లెవల్ ను పెంచడంలో విఫలమైంది. సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. గ్యాంగ్ స్టర్లతో ఉన్న ఫైట్ ఎపిసోడ్స్ బాగున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వేల్యూస్ గ్రాండ్ గా ఉన్నాయి.

చివరగా

'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. స్టైల్ ఉంది, స్టోరీ లేదు!

Tags

Next Story